మూడు కోట్ల నుంచి 30 కోట్లకు ఆ కమెడియన్!
కోలీవుడ్ కమెడియన్ సంతానం డిమాండ్ మామూలుగా లేదిప్పుడు. స్టార్ హీరోల చిత్రాల్లో అతనే కమెడియ న్ కం ప్రెండ్ రోల్
కోలీవుడ్ కమెడియన్ సంతానం డిమాండ్ మామూలుగా లేదిప్పుడు. స్టార్ హీరోల చిత్రాల్లో అతనే కమెడియ న్ కం ప్రెండ్ రోల్. సంతానంతో రెండు రకాలుగా వర్కౌట్ అవ్వడంతో! దర్శకులకు మంచి ఆప్షన్ గా మారాడు. అవసరమైతే కమెడియన్ గా....లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీరియస్ రోల్ లో హైలైట్ చేస్తున్నాడు. రెండు రకాల పాత్రల్ని ఎంతో బ్యాలెన్స్ గా చేస్తున్నాడు. తాజాగా సంతానం ఒక్కో సినిమాకి ఎంత ఛార్జ్ చేస్తున్నాడో? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే .
సినిమా కి మూడు కోట్ల వరకూ తీసుకుంటున్నాడు అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వయంగా నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా ఈ విషయాన్ని రివీల్ చేసాడు. నేను నిర్మించిన జిల్లని వర్ ఖాదాన్ చిత్రానికి సంతానంకు 1.75 లక్షలు మాత్రమే పారితోషికం ఇచ్చాను. ఇప్పుడు ఒక్కో సినిమాకి 3 కోట్లు తీసుకుంటున్నాడు. 30 కోట్లు తీసుకునే స్థాయికి సంతానం ఎదగాలని కోరుకుంటున్నా' అన్నారు.
సంతానం కెరీర్ ప్రారంభించి దశాబ్ధం దాటింది. తొలుత 'అరిఎన్ 305' అనే చిత్రంతో 2008లో నటుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ నటుడిగా వెనుదిరిగి చూడలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. కోలీవుడ్ లెజెండ్స్ తోనూ పనిచే సాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో ఇతర భాషల్లో సైతం సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.
తమిళ హీరోలంతా తెలుగు సినిమాలు చేస్తోన్న నేపథ్యంలో సంతానం లాంటి ఆర్టిస్టులకు మంచి డిమాండ్ క్రియేట్ అవుతుంది. సూర్య..కార్తీ లాంటి హీరోలతో సంతానం ఇప్పటికే చాలా సినిమాలు చేసాడు. ఇద్దరి హీరోలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. సంతానం ఆ క్రేజ్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంది.