47 వ‌య‌సు హీరోతో 21 వయ‌సు హీరోయిన్

ఇటీవ‌లి కాలంలో ప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ హీరోల‌కు క‌థానాయిక‌ల కొర‌త ఇబ్బందిక‌రంగా మారింది.

Update: 2025-02-21 10:30 GMT

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి తాత వ‌య‌సున్న హీరోల‌తో రొమాన్స్ చేసారు. త‌న‌కంటే రెట్టింపు లేదా మూడు రెట్లు అధిక వ‌య‌సున్న న‌టుల‌తో టీనేజీ హీరోయిన్లు రొమాన్స్ చేయ‌డం చాలా ఏళ్లుగా చూస్తున్న‌దే. ఇటీవ‌లి కాలంలో ప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ హీరోల‌కు క‌థానాయిక‌ల కొర‌త ఇబ్బందిక‌రంగా మారింది.

 

ఈ రోజుల్లో హీరోలు - హీరోయిన్ల మధ్య వయస్సు అంతరం అస‌లు షాకింగ్ మ్యాట‌రే కాదు. పెద్ద సూపర్ స్టార్లు త‌మ వయస్సులో సగం కూడా లేని హీరోయిన్ల‌ను ప్రేమించిన సంద‌ర్భాలున్నాయి. అందుకే ఇప్పుడు 21 ఏళ్ల ఈ యంగ్ హీరోయిన్ కూడా 47 వ‌య‌సున్న‌ న‌టుడితో రొమాన్స్ చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌డం లేదు. ఈ ఎపిసోడ్ లో 21ఏళ్ల బ్యూటీ మ‌రెవ‌రో కాదు `ఉప్పెన` ఫేం కృతి శెట్టి. 47 వ‌య‌సున్న కార్తీతో రొమాన్స్ చేస్తోంది. కృతి బాల‌న‌టిగా 15ఏళ్ల‌కే ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మై, హీరోయిన్ అయింది. టాలీవుడ్, కోలీవుడ్ లో పాపుల‌ర్ హీరోయిన్ గా ఎదిగింది.

సూపర్ 30, ఎఆర్ఎం, శ్యామ్ సింఘ‌రాయ్, ది వారియర్, ఉప్పెన , బంగార్రాజు వంటి సినిమాల్లో కృతి న‌టించింది. త‌దుపరి త‌మిళ స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ స‌ర‌స‌న రొమాన్స్ చేస్తోంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా వ‌య‌సు అంత‌రం దాదాపు స‌గం కంటే ఎక్కువ‌. వారిద్దరి మధ్య 26 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. అయినా దాంతో ప‌ని లేకుండా ఈ జంట `వా వాతియార్` అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ ఇదే ఏడాది థియేట‌ర్ల‌లోకి రానుంది.

నలన్ కుమారసామి దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రంలో సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జి.ఎం. సుందర్, రమేష్ తిలక్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రేమ‌క‌థా చిత్రం కాదు.

ఇది తమిళ భాషా యాక్షన్ కామెడీ చిత్రం. దీనిని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె. ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2023లో తాత్కాలిక టైటిల్ కార్తీ 26 ని అధికారికంగా ప్రకటించారు. అధికారిక టైటిల్ మే 2024లో ప్రకటించారు. మార్చి 2023లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభమైంది. ఎట్ట‌కేల‌కు నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Tags:    

Similar News