పెళ్లికి సిద్ధమైన మరో సీనియర్ హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో కొన్ని నెలలుగా వరుసగా పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. అనేక మంది నటీనటులు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు

Update: 2024-03-12 12:48 GMT

సినీ ఇండస్ట్రీలో కొన్ని నెలలుగా వరుసగా పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. అనేక మంది నటీనటులు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. మూడు పదుల వయసు దాటిన ముద్దుగుమ్మలంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోగా.. త్వరలో వరలక్ష్మి శరత్ కుమార్, మీరా చోప్రా కూడా తమ భాగస్వాములతో ఏడడుగులు నడవనున్నారు.

ఇప్పుడు హీరోయిన్ కృతి కర్బంద పెళ్లికి కూడా అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే తన ప్రియుడు, బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ తో వివాహ బంధంలో అడుగుపెట్టనుంది కృతి. ఇటీవల వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆ వేడుక జరిగినట్లు సమాచారం. వారిద్దరి రింగ్స్ కు సంబంధించిన పిక్స్.. ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.

తాజాగా కృతి పెళ్లికి సంబంధించిన కొత్త కబురు నెట్టింట వినిపిస్తోంది. హరియాణాలోని మానేసర్ లో కృతి-పులకిత్ వివాహ వేడుక జరగనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఐటీసీ భారత్ హోటల్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందట. అయితే వీరి వివాహానికి బాలీవుడ్, టాలీవుడ్ నుంచి ఎవరెవరు హాజరవుతారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

బోణి సినిమాతో టాలీవుడ్ మూవీ లవర్స్ కు పరిచయమైంది కృతి. ఫస్ట్ సినిమాలోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. పవన్ కళ్యాణ్ తీన్ మార్ మూవీతో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత ఒంగోలు గిత్త, మిస్టర్ నూకయ్య, బ్రూస్ లీ సినిమాల్లో యాక్ట్ చేసింది. కానీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. దీంతో నార్త్ కు షిఫ్ట్ అయింది. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది.

కాబోయే భర్త పులకిత్ తో కలిపి పాగల్‌ పంతీ, తైశ్‌ తోపాటు కొన్ని సినిమాల్లో నటించింది కృతి. ఆ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఇప్పటికే పులకిత్ కు శ్వేతతో వివాహం జరగ్గా.. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత యామీ గౌతమ్ తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపారు పులకిత్. ఇక 2019 నుంచి కృతితో ప్రేమలో మునిగి తేలుతున్నారు.

Tags:    

Similar News