పెళ్లైన తర్వాత లావణ్య తొలి పలకరింపు!
ఆ సంగతి పక్కనబెడితే పెళ్లైన తర్వాత లావణ్య తొలి పలకరింపు ఇదే. ఆమె నటించిన `మిస్ పర్పెక్ట్` అనే వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇంట కోడలు అన్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లాడటంతో లావణ్యకి ఆ హోదా దక్కింది. అయితే పెళ్లైన తర్వాత ఆమె నటించిన సినిమాగానీ..వెబ్ సిరీస్ గానీ ఎది రిలీజ్ కాలేదు. కోడలిగా కొత్త బాధ్యతలు వచ్చిన నేపథ్యంలో ఇకపై సినిమాలు చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సిన విషయం.
ఆ సంగతి పక్కనబెడితే పెళ్లైన తర్వాత లావణ్య తొలి పలకరింపు ఇదే. ఆమె నటించిన `మిస్ పర్పెక్ట్` అనే వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అవుతోంది. పెళ్లికి ముందే ఈ వెబ్ సిరీస్ కి కమిట్ అయింది. ఇప్పుడు షూటింగ్ సహా అన్ని పనులు పూర్తవ్వడంతో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత అభిమానుల ముందు కు రావడం ఇదే తొలిసారి. వెబ్ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లోనూ లావణ్య చురుకుగా పాల్గొంటుంది.
ఇందులో అభిజిత్ హీరోగా నటిస్తున్నాడు. ఆయువ నటుడికి జోడీగానే లావణ్య నటిస్తుంది. పెళ్లికి ముందు కమిట్ అయిన...పెళ్లి తర్వాత రిలీజ్ అయినా లావణ్య త్రిపాఠి పక్కన అభిజిత్ నటించే ఛాన్స్ అందుకో వడం విశేషం. ఇది అభిజిత్ కెరీర్ కి ఎంతో దోహం చేసేదే. మెగా ఇంట కోడలు అనే ఇమేజ్ ఈ సిరీస్ కి కలిసొచ్చే అంశం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మిస్ పర్పెక్ట్ అంతే క్లీన్ అండ్ గ్రీన్ ఎంటర్ టైనర్ అని దర్శకుడు చెబుతున్నాడు.
అందరూ ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే సిరీస్ ఇది. ఎలాంటి అశ్లీలతకు..అసభ్యతకు తావు లేకుండా తమ సిరీస్ ఉంటుందని ధీమా వ్యక్తం చేసాడు. ఇక లావణ్య త్రిపాఠి తొలి నుంచి క్లీన్ చిత్రాలే చేసింది. రొమాంటిక్ చిత్రాల జోలికి వెళ్లింది లేదు. పద్దతైన పాత్రలతోనే ప్రేక్షకులకు దగ్గరైంది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకుని ముందుకెళ్తుంది. మరి మిస్ పర్పెక్ట్ లో లావణ్య పెర్పార్మెన్స్ ఎలా ఉంటుందన్నది చూడాలి.