'ట‌క్క‌రి దొంగ' బ్యూటీ స‌డెన్ ట్విస్ట్?

మనం .. మనం ప్రేమించే ప్రతి ఒక్కరూ చనిపోతారని తెలిసి మనం ఎలా జీవించాలి? '' అంటూ ఒక ప్ర‌శ్న‌ను సంధించారు.

Update: 2024-05-03 06:36 GMT

నటి కం సూప‌ర్ మోడ‌ల్ లీసా రే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మ‌హేష్ స‌ర‌స‌న 'ట‌క్క‌రి దొంగ' లాంటి యాక్ష‌న్ చిత్రంలో న‌టించింది లీసారే. టాప్ మోడ‌ల్ గా, బాలీవుడ్ క‌థానాయిక‌గా లీసారే గొప్ప పాపులారిటీ ద‌క్కించుకుంది. కానీ కెరీర్ కీల‌క ద‌శ‌లో ఉండ‌గానే క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారీ త‌న జీవితంలో క‌ల్లోలం సృష్టించింది. కానీ ఉత్త‌మ‌మైన అల‌వాట్లు, చికిత్స‌తో కోలుకుంది. ఇండియాలో క్యాన్స‌ర్ నుంచి బ‌య‌ట‌ప‌డిన న‌టీమ‌ణుల్లో లీసారే కూడా ఉన్నారు. లీసారే న‌టి కం మోడ‌ల్ మాత్ర‌మే కాదు.. మంచి క‌వితాత్మ‌క ఆలోచ‌న‌లున్న ర‌చ‌యిత కూడా.

 

తాజాగా ఇన్ స్టా మాధ్య‌మంలో లీసారే ఒక అంద‌మైన నోట్ రాసారు. దాని సారాంశం ఇలా ఉంది. ''చెప్పండి, మనం .. మనం ప్రేమించే ప్రతి ఒక్కరూ చనిపోతారని తెలిసి మనం ఎలా జీవించాలి? '' అంటూ ఒక ప్ర‌శ్న‌ను సంధించారు. ఆ త‌ర్వాత దానికి అనుసంధానంగా నోట్ ని కొన‌సాగించారు. ''గుర్తుంచుకోండి... భద్రత భయంతో చేతులు కలుపుతారు. ఆవిష్కరణ వైఫల్యంతో చేతులు పట్టుకుంటారు. సహకారం సంఘర్షణతో చేతులు కలుపుతారు.. చేర్పు అనేది తేడాతో చేతులు కలుపుతుంది.. ఫలితాలు చేదు తీపికి మధ్య‌ నిష్కపట‌తపై ఆధారపడి ఉంటాయి. నిజానికి అత్యంత ప్రాథమిక మానవ అనుభవంగా చేదు తీపిని సాధారణీకరించడం ఈ ప్రపంచంలో ఆశ్రయాన్ని క‌ల్పిస్తుంది'' అని రాసారు. దుఃఖం -కోరిక మనల్నిఎలా సంపూర్ణులుగా తీర్చిదిద్దుతాయి? అనేది ఆమె విశ్లేషించింది.

 

క్యాన్సర్ సర్వైవర్ లిసా రే వ్యాధితో తన పోరాటం గురించి చాలా నిజాయితీగా వేదిక‌ల‌పై చెబుతుంటారు. క్యాన్సర్‌తో తనకు ఎదురైన కష్టాల గురించి పదే పదే చెబుతారు. 2020లో కరీనా కపూర్ టాక్ షో వాట్ ఉమెన్ వాంట్ సీజన్ 2లో లీసా మాట్లాడుతూ... 2012లో తన పెళ్లి తర్వాత క్యాన్సర్ మళ్లీ వచ్చిందని వెల్లడించింది. లీసా రే తన భర్త జాసన్ దేహ్నీకి ఈ ప‌రిస్థితి గురించి చెప్పలేదని తెలిపింది. ఎందుకంటే లీసా కేవలం 'షాదీని పొందాలని' కోరుకుంది.

వ్యాధితో పోరాటం గురించి కరీనా ప్ర‌శ్నించ‌గా.. నిజం చెప్పాలంటే,..నేను ఒకే ఒకసారి రిలాక్స్ అయ్యాను. కానీ క్యాన్స‌ర్ మ‌ళ్లీ రిపీటైంది. ఇది నేను పెద్దగా మాట్లాడని విషయం. పెళ్లయిన నెల రోజులకే ఇలా జరిగింది! అని తెలిపింది. ఈ స‌మ‌యాన్ని అత్యంత కష్టమైనదిగా పేర్కొంది. నిజానికి ఆ రహస్యాన్ని నా భర్తకు కూడా చెప్ప‌కుండా దాచిపెట్టాను. నేను షాదీతో ప‌రిపూర్ణం అవ్వాలి. ఆపై ఏం చేయాలో కనుగొంటాను. కాబట్టి ఇలాంటి సంద‌ర్భాలు చాలా తక్కువ. నేను మొదటిసారి క్యాన్సర్ ఎదుర్కొన్న‌ప్పుడు ఒంటరిగా ఉన్నాను.. అని లీసారే తెలిపారు.

 

లిసా రే తన వివాహం అయిన వెంటనే మంచి పోషకాహారం తీసుకుని సంపూర్ణ వైద్యం పొందాన‌ని కూడా తెలిపారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న న‌న్ను వివాహం చేసుకోవడానికి ఒక‌ అందమైన వ్యక్తిని క‌లిసాను అని కూడా వెల్ల‌డించింది. పోష‌కాహారంతో సంపూర్ణ వైద్యం పొందాను. నా ఆహారాన్ని సమూలంగా మార్చిన మూడు నెలల్లోనే, నేను ఉపశమనం పొందాను.. అని కూడా లీసారే తెలిపారు.

మోడ‌ల్ కం న‌టి లిసా రే 2012లో వ్యాపారవేత్త జాసన్ దేహ్నిని వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 2018లో ఈ జంటకు కవల కుమార్తెలు సోలీల్ రే-దేహ్ని , సూఫీ రే-దేహ్ని కి పేరెంట్ అయ్యారు. లీసా రే 1996లో తమిళ చిత్రం నేతాజీ లో తొలిసారిగా నటించింది. 2001లో అఫ్తాబ్ శివదాసాని 'కసూర్‌'తో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. దీపా మెహతా వాట‌ర్, వీరప్పన్, దొబారా వంటి చిత్రాలలో నటించింది. ఎండ్‌గేమ్, బ్లడ్ టైస్, టాప్ చెఫ్ కెనడా, మర్డోక్ మిస్టరీస్ , ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వంటి టీవీ షోలు, వెబ్ సిరీస్‌లలో లిసా న‌టించింది. ట‌క్క‌రి దొంగ‌తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. లీసారే ఇన్ స్టా మాధ్య‌మంలో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. తాజాగా బికినీ షూట్‌లో ఈ బ్యూటీ క‌వ్విస్తున్న ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Tags:    

Similar News