మహేష్ తో ఇండియా భామకి ఛాన్సే లేదు!
సూపర్ స్టార్ మహేష్ -రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఏ క్షణమైనా ఎలాంటి అప్ డేట్ అయినా వచ్చే అవకాశం ఉంది.
సూపర్ స్టార్ మహేష్ -రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఏ క్షణమైనా ఎలాంటి అప్ డేట్ అయినా వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో దసరా సందర్భంగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తప్పక వస్తుందనే అంచనాలు భారీగా ఉన్నాయి అభిమానుల్లో. అయితే ఇందులో మహేష్ సరసన ఛాన్స్ అందుకునే భామ ఎవరు? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రాకుమారుడు సరసన హీరోయిన్ ఎవరవుతారు? అన్న దానిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపించింది. దీపికా పదుకోణే పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ ఆమె కల్కి లో లాక్ అవ్వడంతో రాజమౌళి ఆ ఛాన్స్ తీసుకోరని డిసైడ్ అయిపోయారు.
ఇంకా కరీనా కపూర్ఖాన్, ప్రియాంక చోప్రా ఇలా టాప్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరికొన్నిరోజులకు ఇది అంతర్జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి బాలీవుడ్ భామల్ని ఎందుకు తీసుకుటారని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో కొంతమంది హాలీవుడ్ భామల పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. ఇండోనేషియా తార చెల్షీయా ఎలిజిబెత్ తో పాటు మరో ఇద్దరు భామల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.
తాజా అప్ డేట్ ఏంటి? అంటే సినిమాలో హీరోయిన్? అన్నది కేవలం హాలీవుడ్ నుంచే తీసుకుంటు న్నారుట. బాలీవుడ్ ఆలోచనే రాజమౌళికి లేదని ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీకైంది. అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ కావడంతో అక్కడ మార్కెట్ని ఆధారంగా చేసుకుని కీలక పాత్రలకు అక్కడ నటీనటులకు పెద్ద పీట వేస్తున్నట్లు లీకులందుతున్నాయి.