ఇప్పటి వరకు ట్రై చేయని పాత్రలో మహేష్?
కానీ, గ్యాంగ్ స్టార్ గా మాత్రం ఎప్పుడూ చేసింది లేదు. అయితే, తొలిసారి ఆయన గ్యాంగ్ స్టార్ రోల్ లో మెప్పించాలని అనుకుంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు చివరగా, సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో, ఆయన కొత్త సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ ఎదురు చూపులకు తగ్గట్టు, గుంటూరు కారం మూవీ ఆలస్యమౌతూ వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి, ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, ఏవేవో కారణాల వల్ల షూటింగ్ వాయిదా అవుతూ రావడం వల్ల , ఈ మూవీ కాస్త విడుదల ఆలస్యమైంది.
ఈ మూవీలో మొదట పూజా హెగ్డే హీరోయిన్ అనుకున్నారు. కానీ, చివరకు శ్రీలీల మొయిన్ హీరోయిన్ గా మారగా, మీనాక్షి చౌదరి అనే మరో హీరోయిన్ స్క్రీన్ లోకి వచ్చింది. ఈ మూవీ అయిపోగానే, మహేష్ రాజమౌళితో మూవీ ప్రారంభం కానుంది. రాజమౌళి టేకింగ్ అంటే, చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ, టైమ్ మాత్రం చాలా ఎక్కువ కాలమే పడుతుంది. అయితే, ఈ మూవీ తర్వాత మాత్రం మహేష్ ఇప్పటి వరకు చేయని ఓ డిఫరెంట్ రోల్ లో ప్రేక్షకులను అలరించనున్నారట.
మహేష్ మాస్ , క్లాస్ రెండు లుక్స్ లో అలరించాడు. టక్కరి దొంగ లో కౌబాయ్ గా కూడా చేశాడు. కానీ, గ్యాంగ్ స్టార్ గా మాత్రం ఎప్పుడూ చేసింది లేదు. అయితే, తొలిసారి ఆయన గ్యాంగ్ స్టార్ రోల్ లో మెప్పించాలని అనుకుంటున్నారు. ఈ మూవీకి అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
తాను మహేష్ కోసం ఓ కథ రాసుకున్నానని, ఆ కథతో ఎప్పటికైనా ఆయనతో సినిమా చేస్తానని సందీప్ గతంలో చెప్పారు. అయితే, అది పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ రోల్ అని తెలుస్తోంది. మహేష్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ లా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి. నిజమైతే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.
ఇక, సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీ తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.