ఫోటో స్టోరి: మలైకా అరోరా బాస్ లేడీ వైబ్స్‌

ప్ర‌తిష్ఠాత్మ‌క‌ లాక్మే ఫ్యాషన్ వీక్ x FDCI షో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌.

Update: 2023-10-15 10:15 GMT

ప్ర‌తిష్ఠాత్మ‌క‌ లాక్మే ఫ్యాషన్ వీక్ x FDCI షో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌. ముంబైలో జ‌రుగుతున్న ఈ ఈవెంట్లో సెలబ్రిటీలు ర్యాంప్‌పై తమ అత్యుత్తమ ఫ్యాషన్ ప్ర‌ద‌ర్శ‌న‌తో దుమారానికి తెర తీస్తున్నారు. కొత్తగా పెళ్లయిన పరిణీతి చోప్రా నుండి దిశా పటానీ వరకు యువ‌త‌రంలో జాన్వీ కపూర్ - సారా అలీఖాన్ నుంచి సబా ఆజాద్ వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రూ ర్యాంప్‌పై హెడ్ ట‌ర్న‌ర్స్ గా మారారు. ఇక ఇదే వేదిక‌పై మలైకా అరోరా స్ట‌న్నింగ్ బ్రాలెస్ లుక్ మ‌తులు చెడ‌గొట్టింది.

లాక్మే ఫ్యాషన్ వీక్ 4వ రోజు x FDCI మలైకా అరోరా మేజర్ బాస్ లేడీ వైబ్స్ తో రన్‌వేపై నడిచింది. మలైకా అద్భుతమైన ప్యాంట్‌సూట్‌ను ధరించి స్ట్రైకింగ్ లుక్ తో షో స్టాప‌ర్ గా నిలిచింది. మ‌ల్లా (మ‌లైకా) ఎక్క‌డుంటే అక్క‌డ క‌ళ్లు ఉండాల్సిందేన‌ని మ‌రోసారి నిరూపించింది. ఈ డిజైన‌ర్ లుక్ లో తన ప్యాంట్-సూట్ లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చింది. షర్టు లెస్ గా.. సెడక్టివ్ బ్రాలెట్ తో క‌నిపించింది. అంద‌రి దృష్టిని ఆకర్షించే అద్భుతమైన బ్లేజర్ త‌న న‌డుమును హైలైట్ చేసేలా అద్భుతమైన ప్యాంటును మ‌లైకా ధ‌రించింది. ఒక విధంగా చెప్పాలంటే మ‌లైకా నిజమైన బాస్ లాగా ర్యాంప్‌ను అల్లాడించింది.

అయితే నెటిజల్లో ఒక వ‌ర్గం మ‌లైకా ధ‌రించిన‌ దుస్తులను చూసి త‌ట్టుకోలేక ఘాటైన కామెంట్లు చేసారు. బ్రాలెస్ లుక్ తో ర్యాంప్‌పై వాక్ చేసినందుకు ట్రోల్ చేశారు. ఆమె ఎందుకు బ్రేలెస్‌గా క‌నిపించింది? అంటూ ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించ‌గా, మరొకరు ``క్లీవేజ్ చూపించాల్సిన అవసరం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. అయితే వీటిపై మ‌లైకా స్పందించ‌లేదు.

వ్యక్తిగతంగా చూస్తే మలైకా బాలీవుడ్ యువ‌హీరో త‌న కంటే 15 ఏళ్ల చిన్న‌వాడైన‌ అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. ఈ జంట ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. మ‌లైకా గతంలో నటుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకోగా, 20 ఏళ్ల కుమారుడు అర్హాన్ ఖాన్ ఉన్నాడు. మ‌లైకా-ఆర్భాజ్ 2017లో విడాకులు తీసుకున్నారు. కుమారుడికి సహ-తల్లిదండ్రులుగా కొన‌సాగుతున్నారు.

Tags:    

Similar News