మణి సార్ మళ్లీ అదే ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందా..?

మణిరత్నం కమల్ హాసన్ ఈ కాంబినేషన్ సినిమా అంటే కోలీవుడ్ ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క.

Update: 2024-06-01 07:30 GMT
మణి సార్ మళ్లీ అదే ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందా..?
  • whatsapp icon

మణిరత్నం కమల్ హాసన్ ఈ కాంబినేషన్ సినిమా అంటే కోలీవుడ్ ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క. కెరీర్ మొదట్లోనే మణిరత్నం టాలెంట్ ని గుర్తించి అవకాశం ఇచ్చాడు కమల్ హాసన్. ఇక ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమా నాయకన్ సినిమా ఎంత సంచలన విజయం అందుకుందో తెలిసినే. ఐతే మళ్లీ దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. విక్రం తో తిరిగి కెరీర్ లో డబుల్ జోష్ అందుకున్న కమల్ హాసన్ క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటున్నాడు. అందులో మణిరత్నం సినిమా కూడా ఒకటి.

ఈ కాంబో సినిమాకు థగ్ లైఫ్ అనే టైటిల్ లాక్ చేశారు. థగ్ లైఫ్ సినిమా భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో వస్తుంది. ఐతే ఈ సినిమాను ముందు ఒక భాగంగానే చేయాలని అనుకున్నా ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకున్నారని తెలుస్తుంది. మణిరత్నం కమల్ థగ్ లైఫ్ కూడా బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ తరహాలో రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట. అఫీషియల్ గా త్వరలోనే ఈ విషయాన్ని చెప్పబోతారంటూ కోలీవుడ్ టాక్.

థగ్ లైఫ్ సినిమా గ్లింప్స్ తోనే సినిమాపై సూపర్ బజ్ పెంచేశాడు మణిరత్నం. పి.ఎస్ రెండు భాగాల తర్వాత ప్రెస్టీజియస్ గా చేస్తున్న సినిమా థగ్ లైఫ్. ఈ సినిమాలో కమల్ తో పాటు శింబు ఇంకా చాలామంది ఇతర క్రేజీ ఆర్టిస్టులు నటిస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఈ సినిమా కథ అనుకున్న దానికన్నా గొప్పగా వస్తుండటం వల్ల సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

మణిరత్నం పి.ఎస్ 1 అండ్ 2 రెండు భాగాలను ఒకేసారి షూట్ చేసి రెండిటి మధ్య ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేశారు. కానీ కమల్ థగ్ లైఫ్ మాత్రం అలా కాకుండా ఫస్ట్ పార్ట్ అనుకున్నంత వరకే పూర్తి చేసి రిలీజ్ చేసి ఆ తర్వాత సెకండ్ పార్ట్ షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. కమల్ తో మణిరత్నం చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నం ఎంతవరకు ప్రేక్షకుల మెప్పు పొందుతుంది అన్నది చూడాలి. ఈ సినిమాతో పాటుగా మణిరత్నం కోలీవుడ్ స్టార్స్ తో మెగా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

Tags:    

Similar News