మార్చి లో బాక్సాఫీస్ ఫైట్.. ఎన్ని సినిమాలాంటే

జనవరి సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ కి హనుమాన్ రూమ్ లో ఒక సూపర్ సక్సెస్ లభించింది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Update: 2024-02-24 05:52 GMT

జనవరి సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ కి హనుమాన్ రూమ్ లో ఒక సూపర్ సక్సెస్ లభించింది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఫిబ్రవరి నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా కలిసి రాలేదు. భారీ సక్సెస్ లు అయితే ఇప్పటి వరకు రాలేదు. చిన్న సినిమాలుగా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, సుందరం మాస్టర్ సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి.

ఊరు పేరు భైరవకోన సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. మిగిలిన సినిమాలు ఏవీ పెద్ద ప్రభావం చూపించలేదు. మార్చి 1 నుంచి ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మార్చి నెలలో ఏకంగా 14 సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతూ ఉండటం విశేషం. వాటిలో ట్రైలర్స్ తో ఆకట్టుకొని పాజిటివ్ వైబ్ సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చి 1న రిలీజ్ అవుతోంది. వెన్నెల కిషోర్ లీడ్ రోల్ చేస్తోన్న డిటెక్టివ్ కామెడీ చారి 111, శివ కందుకూరి లీడ్ రోల్ చేస్తోన్న బూతద్దం భాస్కర్ నారాయణ, ఆర్జీవీ వ్యూహం మార్చి 1న థియేటర్స్ లోకి రాబోతున్నాయి. వీటిలో ఎన్ని ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటాయనేది తెలియాల్సి ఉంది. తరువాత మార్చి 8న విశ్వక్ సేన్ గామి, గోపీచంద్ మాస్ యాక్షన్ మూవీ భీమా, ఆర్జీవీ శపథం రిలీజ్ కానున్నాయి.

మార్చి 15న తంత్ర అనే సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే లైన్ మెన్ అనే మరో చిన్న సినిమా కూడా థియేటర్స్ లోకి రాబోతోంది. మార్చి 22న హుసారు ఫేమ్ హర్ష దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణన్ కాంబినేషన్ లో తెరకెక్కిన డిఫరెంట్ కామెడీ మూవీ ఓం భీమ్ బుష్ రిలీజ్ కాబోతోంది. అల్లరి నరేష్ కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు అదే రోజు థియేటర్స్ లోకి రాబోతోంది.

రోటీ కామదా రొమాన్స్ అనే చిన్న సినిమా ఒకటి రిలీజ్ అవుతోంది. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఆడుజీవితం డబ్బింగ్ మూవీ మార్చి 28న ప్రేక్షకులని పలకరించబోతోంది. వీటితో పాటు మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ టిల్లు స్క్వేర్ మార్చి 29న థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతోంది. మార్చి నెలలో వచ్చే మూవీస్ లో చాలా వాటి మీద పాజిటివ్ బజ్ ఉంది. వీటిలో ఏది బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి.

ఆపరేషన్ వాలంటైన్ - Mar 01, 2024

చారి 111 - Mar 01, 2024

బూతద్దం భాస్కర్ నారాయణ - Mar 01, 2024

వ్యూహం - Mar 01, 2024

గామి - Mar 08, 2024

భీమా - Mar 08, 2024

శపథం - Mar 08, 2024

తంత్ర - Mar 15, 2024

లైన్ మెన్ - Mar 15, 2024

ఓం భీమ్ బుష్ - Mar 22, 2024

ఆ ఒక్కటి అడక్కు - Mar 22, 2024

రోటీ కపడా రొమాన్స్ - Mar 22, 2024

ఆడు జీవితం (డబ్బింగ్) - Mar 28, 2024

టిల్లు స్క్వేర్ - Mar 29, 2024

Tags:    

Similar News