మాస్ రాజా మాస్ జాతర టార్గెట్ ఫిక్స్..!
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజ్ సినిమా హిట్టు పడితే బాక్సాఫీస్ సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. తన మార్క్ ఎంటర్టైనర్ సినిమాగా ఎలాంటి కథతో వచ్చినా మాస్ రాజా ఫ్యాన్స్ అలరిస్తారు. ఐతే ఏమాత్రం తేడా కొట్టినా సరే పెదవి విరుస్తారు. అందుకే ధమాకాతో 100 కోట్ల హిట్ ఇచ్చిన మాస్ రాజా ఫ్యాన్స్ తర్వాత రవితేజ ఏ సినిమా చేసినా వర్క్ అవుట్ అవ్వలేదు. ఐతే ప్రస్తుతం మాస్ మహారాజ్ మాస్ జాతర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మాస్ జాతర టైటిల్ పెట్టడానికి కారణం రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయడమే కాదు ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో హిట్ జోడీ శ్రీలీల కూడా నటిస్తుంది. సో ఈ సినిమాకు అన్ని పాజిటివ్ అంశాలే ఉన్నాయి.
మాస్ రాజా మాస్ జాతర మీద ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. మాస్ రాజా రవితేజ నుంచి కోరుకునే అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉండేలా ఉన్నాయి. అసలైతే ఈ సినిమా ఈపాటికి రిలీజ్ అవ్వాల్సింది కానీ షూటింగ్ టైం లోనే రవితేజ భుజానికి గాయం అవ్వడం వల్ల లేట్ అవుతూ వచ్చింది.
ఐతే లేట్ గా వచ్చినా సరే లేటెస్ట్ గా ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ధమాకాతో కొట్టిన 100 కోట్లను కూడా మాస్ జాతర సినిమా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోయినా సరే త్వరలో టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్నారు మేకర్స్. రవితేజ కూడా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు. తాను ఊహించినట్టుగా ఈమధ్య సినిమాల ఫలితాలు లేకపోవడం వల్ల మాస్ జాతర తో మళ్లీ తన హిట్ మేనియా మొదలు పెట్టాలని చూస్తున్నాడు రవితేజ. సినిమా సమ్మర్ రేసులో ఉంటుందని వార్తలు వస్తున్నా అఫీషియల్ గా ఎప్పుడు రిలీజ్ అన్నది మేకర్స్ ప్రకటించాల్సి ఉంది.