మెగ్ పిక్ అదిరిదింగా..!

మెగా హీరోలైన రామ్ చరణ్, సాయి తేజ్, వరుణ్ తేజ్ ముగ్గురు అలా క్యాజువల్ గా జిమ్ లో ఫోటో దిగారు. మెగా హీరోలు ముగ్గురితో పాటు ఫిట్ నెస్ ట్రైనర్ రాకేష్ ఆర్ ఉదియార్ కూడా ఉన్నాడు.

Update: 2025-02-09 13:30 GMT

మెగా హీరోలంతా కూడా ఒకచోట కంపిస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. ముఖ్యంగా వారి వర్క్ అవుట్స్ టైం లో అలా ముగ్గురు సరదాగా కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే. వాళ్ల మధ్య సరదా సంభాషణలు ఏంటన్నది బయటకు తెలియకపోయినా మెగా హీరోలు అలా కలిశారంటే మెగా ఫ్యాన్స్ కి సూపర్ జోష్ వస్తుంది. లేటెస్ట్ గా అలాంటి జోష్ ఫుల్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకున్నారు.


మెగా హీరోలైన రామ్ చరణ్, సాయి తేజ్, వరుణ్ తేజ్ ముగ్గురు అలా క్యాజువల్ గా జిమ్ లో ఫోటో దిగారు. మెగా హీరోలు ముగ్గురితో పాటు ఫిట్ నెస్ ట్రైనర్ రాకేష్ ఆర్ ఉదియార్ కూడా ఉన్నాడు. చరణ్, వరుణ్ తో పాటు సాయి తేజ్ ఉన్న ఫోటోని తేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మాకు రెస్ట్ తీసుకోము.. మేము రీ లోడ్ అవుతాం అని కామెంట్ పెట్టాడు. ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ అయితే సూపర్ అనేస్తున్నారు.

ఇక చరణ్ రీసెంట్ గా గేమ్ ఛేంజర్ తో ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇక తేజ్ సంబరాల ఏటి గట్టు సినిమాతో రాబోతుండగా వరుణ్ తేజ్ తన కొత్త సినిమా మేర్లపాక గాంధితో లాక్ చేసుకున్నాడు. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా మా ప్రయత్నాలు మాత్రం మేము చేస్తుంటాం అనేలా వారు కష్టపడుతున్నారు.

ఏది ఏమైన సండే రోజు ఈ మెగా హీరోల మెగా పిక్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ ముగ్గురు కలిసి ఒక మల్టీస్టారర్ చేసేయొచ్చు కదా అని అనేస్తున్నారు. సరైన కథ పడితే ఈ ముగ్గురు కలిసి నటించడానికి రెడీ అనేస్తారు. ఐతే చరణ్ డేట్స్ దొరకడం కష్టం కాబట్టి కనీసం తేజ్, వరుణ్ అయినా కలిసి మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఉందని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే వాళ్లిద్దరు కూడా ఒక మెగా మాస్ ఎంటర్టైనర్ తో వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సాయి తేజ్, వరుణ్ తేజ్ కూడా వారిని మెప్పించే కథ వస్తే మల్టీస్టారర్ చేయడానికి నో చెప్పే ఛాన్స్ లేదు.

Tags:    

Similar News