మెగా 157.. ఫ్యాన్స్ లో హైప్ పెంచుతున్న 3 అంశాలివే

దీని కోసం మెగాస్టార్‌ను రెండు లుక్స్ లో చూపించనున్నారట. ఒకటి ప్రొస్తెటిక్ మేకప్ లో చూపిస్తారని తెలిసింది.

Update: 2023-08-25 03:45 GMT

బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సోషియో ఫాంటసీగా రాబోతున్న సంగతి తెలిసిందే. చిరు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ మంచి ఆసక్తిని రేకెత్తించింది. పంచభూతాల నేపథ్యంలో రాబోతుందంటూ పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్. దీంతో కథ ఎలా ఉండబోతుందో, చిరును ఎలా చూపించబోతున్నారో, సినిమాలో విజువల్ ట్రీట్ ఏ రేంజ్ లో చూపిస్తారా అంటూ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మూడు విషయాల గురించి. మొదటిది అసలీ ఈ చిత్రంలో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించనున్నారా అనేది. ఈ సినిమాలోని కొన్ని వీఎఫ్ ఎక్స్ నేపథ్యంలో షూట్ చేయబోయే సీన్స్ కోసం చిరంజీవితో పాటు ఇతర మూవీటీమ్ విదేశాలకు వెళ్లబోతున్నారని తెలిసింది. హాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ సీజీ కంపెనీ దీని కోసం పనిచేయనుందని సమాచారం అందింది.

ఇక రెండో విషయం ఏంటంటే, ఈ చిత్రంలో మంచి-చెడు అనే రెండు అంశాలను చూపించబోతున్నారని చెబుతున్నారు. దీని కోసం మెగాస్టార్‌ను రెండు లుక్స్ లో చూపించనున్నారట. ఒకటి ప్రొస్తెటిక్ మేకప్ లో చూపిస్తారని తెలిసింది. అంటే చూడటానికి భయంకరమైన, అందవిహీనంలా కనిపిస్తారని అర్థం. మరో లుక్ కోసం వీఎఫ్ ఎక్స్ ను జోడించి చూపించనున్నారని అంటున్నారు.

ఇక మూడోది ఈ చిత్రం చిరుకు తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. మొదట తెలుగులో రిలీజ్ చేసి ఆ తర్వాత హిందీలో డబ్బింగ్ చేయకుండా డైరెక్ట్ గా పాన్ ఇండియా లెవల్ లో అన్ని భాషల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే ఈ సినిమా కథ అందరికీ కనెక్ట్ అయ్యేలా చూడటంతో పాటు ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ హైస్టాండర్డ్స్ ఉండేలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఇప్పటికే దర్శకుడు వశిష్ఠ తన తొలి సినిమా బింబిసారను సోషియో ఫాంటసీగా తెరకెక్కించి గ్రాండ్ హిట్ ను అందుకున్నారు. లో బడ్జెట్ లోనే అద్భుతంగా తీశారు. హీరో కల్యాణ్ రామ్ కు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందించారు. దీంతో ఇప్పుడు మెగాస్టార్ తో చేయబోయే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Tags:    

Similar News