పిక్‌టాక్‌ : నువ్వు గర్వించేలా చేశావు.. చరణ్ గురించి కైఫ్‌

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Update: 2025-02-12 09:54 GMT

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకు షూటింగ్‌లో పాల్గొన్న రామ్‌ చరణ్ చిన్న గ్యాప్‌ తీసుకుని ముంబయిలో జరుగుతున్న ఐఎస్‌పీఎల్‌ టీ10 క్రికెట్‌ లీగ్‌ సీజన్‌ 2లో పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లో ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు సహ ఓనర్‌గా రామ్‌ చరణ్ ఉన్నారు. అందుకే ఆ జట్టును ఉత్సాహ పరచడం కోసం రామ్‌ చరణ్ ముంబయిలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను రామ్‌ చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసిన విషయం తెల్సిందే.


రామ్‌ చరణ్‌తో కలిసి మాజీ టీం ఇండియా క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్ తీసుకున్న పోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎక్స్ ద్వారా కైఫ్‌ ఈ ఫోటోను పంచుకున్నారు. అంతే కాకుండా గ్లోబల్ స్టార్‌ ఇమేజ్ సొంతం చేసుకున్నా చాలా సింపుల్‌గా ఉంటారు, ఇతడితో నాటు నాటు అంటూ స్టెప్స్ వేయాలని అనిపిస్తుందని అన్నారు. గ్లోబల్‌ సూపర్‌ స్టార్‌ అయినా డౌట్‌ టు ఎర్త్‌ అంటూ రామ్‌ చరణ్‌ని కైఫ్‌ ప్రశంసించారు. నువ్వు ప్రతి ఒక్కరిని గర్వించేలా చేశావు అంటూ ట్వీట్‌ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటించి ఆస్కార్‌ వేదిక వరకు వెళ్లడం ప్రతి ఒక్కరూ గర్వించేలా చేశారని కైఫ్‌ ఉద్దేశం అయ్యి ఉంటుంది.

రామ్‌ చరణ్‌ మొన్న సంక్రాంతికి 'గేమ్‌ ఛేంజర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. కానీ అంతకు ముందు వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు చరణ్ కి గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌ని తెచ్చి పెట్టింది. అందుకే రామ్‌ చరణ్‌ ఏ వేదిక ఎక్కినా, ఎక్కడ ఉన్నా ఆర్‌ఆర్‌ఆర్‌ స్టార్‌ గా చూస్తున్నారు. అద్భుతమైన నటనతో మెప్పించారు అంటూ రామరాజు పాత్రను గురించి మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్‌ఆర్‌ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో వెయ్యి కోట్లకు మించి వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం చరణ్‌ కొత్త సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోంది. ఉప్పెన వంటి సూపర్‌ సెన్షేషనల్‌ మూవీ తర్వాత రామ్‌ చరణ్‌తో బుచ్చిబాబు రూపొందిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ల మూవీ ఉంటుంది అంటూ బుచ్చిబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గేమ్‌ ఛేంజర్‌ నిరాశ మిగల్చడంతో వెంటనే రామ్‌ చరణ్‌ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు అయిన జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లో మరో విజయాన్ని ఈ సినిమాతో దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News