నటించొద్దంటూ నటుడి కుటుంబాన్ని బెదిరించారు!
విజయ్ సేతుపతి ప్రస్తుతం తన లేటెస్ట్ రిలీజ్ 'జవాన్' సక్సెస్ ని ఆస్వాధిస్తున్నాడు. తదుపరి వరుస చిత్రాలతో అతడు కెరీర్ పరంగా బిజీ
తన బయోపిక్ 800 నుండి విజయ్ సేతుపతి నిష్క్రమణపై ముత్తయ్య మురళీధరన్ ఓపెన్ అయ్యాడు. రాజకీయ నాయకులు అతనిని బెదిరించారని తెలిపారు. మరింత లోతుగా వివరాల్లోకి వెళితే...
విజయ్ సేతుపతి ప్రస్తుతం తన లేటెస్ట్ రిలీజ్ 'జవాన్' సక్సెస్ ని ఆస్వాధిస్తున్నాడు. తదుపరి వరుస చిత్రాలతో అతడు కెరీర్ పరంగా బిజీ. అయితే శ్రీలంకన్ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ను 800 పేరుతో చేయాల్సి ఉంది. అయితే సేతుపతి ఈ చిత్రం నుండి అనూహ్యంగా తప్పుకున్నాడు. ఇప్పుడు నిష్క్రమణ వెనుక కారణాన్ని క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ వెల్లడించాడు.
జాతీయ మీడియాతో ఇటీవల జరిగిన సంభాషణలో ముత్తయ్య మురళీధరన్ స్వయంగా తెరవెనుక ఏమి జరిగిందో వెల్లడించాడు. నేను IPLలో ఉన్న సమయంలో విజయ్ సేతుపతి షూటింగ్ కోసం అదే హోటల్లో బస చేసినట్లు తెలిసింది. సేతుపతి నాతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించాడు. మొదట్లో విషయం ఏమిటో తెలియకపోయినప్పటికీ సేతుపతి క్రికెట్‌కు అభిమాని అయినందున కలవడానికి అంగీకరించాను. అతను ఐదు రోజుల పాటు రెండు గంటలు చొప్పున కేటాయించగా ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తరువాత స్క్రిప్ట్ వివరణ కోసం రాత్రి 8 గంటలకు కలిసేవాళ్లం. స్క్రిప్టు విన్న తర్వాత ఈ చిత్రంపై నిజమైన ఉత్సాహం వ్యక్తమైంది. అలాంటి అపూర్వ అవకాశాన్ని వదులుకోనని, ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి ఆసక్తిగా ఉన్నానని సేతుపతి పేర్కొన్నాడు. తదనంతరం మేం ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రొడక్షన్ హౌస్ కూడా సిద్ధమైందని తెలిపాడు.
అయితే రాజకీయ నాయకుల విపరీతమైన వ్యాఖ్యల కారణంగా విజయ్ సేతుపతి ఈ బయోపిక్ లో నటించకూడదని నిర్ణయించుకున్నాడు. కొందరు రాజకీయ నాయకులు అతడిపై ఒత్తిడి తెచ్చారు. అతడు విపరీతమైన ఒత్తిడికి లోనయ్యాడు. విజయ్ కుటుంబాన్ని కూడా బెదిరించారని క్రికెటర్ మురళీధరన్ చెప్పాడు. ''ఈ చిత్రం స్పోర్ట్స్ మూవీ.. ఇది రాజకీయాలు చేయడమో లేదా మరే ఇతర కంటెంట్ తో తెరకెక్కేది కాదు. ఇది కేవలం ఒక ఆటగాడి నిజమైన కథ.. కానీ సినిమా కారణంగా విధ్వంసం నచ్చదు. విజయ్ సేతుపతి కెరీర్ ముఖ్యం'' అని అన్నారు.
విజయ్ సేతుపతి కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌లో విలన్ పాత్రలో కనిపించిన అతడు తదుపరి శ్రీరామ్ రాఘవన్ చిత్రం మెర్రీ క్రిస్మస్లో కనిపించనున్నారు. డిసెంబర్ 15 న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకున్నాడు.