గేమ్ ఛేంజర్ 'నానా హైరానా'.. వ్వాటే మెలోడీ
నానా హైరానా సాంగ్ ను మూవీ ఇన్ ఫ్రా రెడ్ టెక్నాలజీతో షూట్ చేశామని, విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయని దర్శకుడు శంకర్ పలుమార్లు తెలిపారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా మరోసారి గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగమ్మాయి అంజలి మరో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసిన మేకర్స్.. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు.. మరోవైపు ప్రమోషన్స్ ను చేపడుతున్నారు. ప్రస్తుతం వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రెండు సాంగ్స్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా మోస్ట్ అవైటెడ్ థర్డ్ సింగిల్ నానా హైరానా మేకర్స్ గురువారం విడుదల చేశారు.
అయితే ఆ సాంగ్ రిలీజ్ కు ముందే చార్ట్ బస్టర్ గా నిలిచేసింది! అందుకు కారణం గ్లింప్స్. రెండు మూడు లైన్లను సింగర్స్ పాడుతున్నట్లు మేకర్స్ రిలీజ్ చేసిన చిన్న వీడియో.. సాంగ్ ను వేరే లెవెల్ లో హిట్ చేసేసింది. ఇప్పుడు పాట రిలీజ్ అయ్యాక ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటోంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఫుల్ ట్రెండ్ అవుతోంది.
నానా హైరానా.. ప్రియమైన హైరానా.. అంటూ సాగుతున్న మెలోడీ సాంగ్ ను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాణీలు కట్టగా.. శ్రేయ ఘోషాల్, కార్తీక్ పాడారు. అయితే సాంగ్ విజువల్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని సినీ ప్రియులు చెబుతున్నారు. డైరెక్టర్ శంకర్ చెప్పినట్లు ఉన్నాయని, ఆయన మార్క్ కనిపిస్తుందని అంటున్నారు.
నానా హైరానా సాంగ్ ను మూవీ ఇన్ ఫ్రా రెడ్ టెక్నాలజీతో షూట్ చేశామని, విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయని దర్శకుడు శంకర్ పలుమార్లు తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. కార్తీక్, శ్రేయ ఘోషల్ వాయిసెస్ పాటకు ప్రాణం పోశాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం చాలా అందంగా ఉంది.
ఓవరాల్ గా వినడానికి మెలోడీ చాలా బాగుందని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు. తమన్ అదిరిపోయే ట్యూన్ అందించారని కామెంట్లు పెడుతున్నారు. ఒక మంచి మెలోడీ సాంగ్ ఇచ్చారని అంటున్నారు. శంకర్ మార్క్ పిక్చరైజేషన్ పాటను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లిందని.. సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు వెయిటింగ్ అని కామెంట్లు పెడుతున్నారు.