'క‌ల్కి 2' కంటే ముందు నాగీ మ‌రో చిత్ర‌మా?

ఇదంతా పూర్త‌వ్వ‌డ‌నికి ఎలా లేద‌నా? మూడేళ్ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ గ్యాప్ లో నాగీ ఏం చేస్తాడు? అంటే..

Update: 2025-02-15 08:30 GMT

`క‌ల్కి 2` చిత్రం ఓ రెండు..మూడు సినిమాల‌తో స‌మానంగా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ `క‌ల్కి 2898` విజ‌యం త‌ర్వాత ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `క‌ల్కి 2` ఎప్పుడు ఉంటుంది? అన్న ప్ర‌శ్న‌కు నాగీ అలా స‌మాధానం ఇచ్చారు. అంటే ఆ సినిమా ఎప్పుడు చేసినా ? ఎప్పుడు రిలీజ్ చేసినా? ప్రేక్ష‌కుల‌కు ఊహ‌కంద‌ని విధంగా మ‌రో అద్భుతంలా సినిమా ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు.

అయితే ప్ర‌భాస్ లైనప్ లో ఉన్న చివ‌రి చిత్రం ఏది? అంటే అది `క‌ల్కీ 2` గానే క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ `పౌజీ` చిత్రాన్ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. దీంతో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న `రాజాసాబ్` పూర్తి చేస్తాడు. ఈ రెండు చిత్రాల్లో రాజాసాబ్ ఇదే ఏడాది....పౌజీ ఏడాది ముగింపులో గానీ వ‌చ్చే ఏడాది గానీ రిలీజ్ అవుతుంది. ఈ మ‌ధ్య‌లో డార్లింగ్ సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ `స్పిరిట్` ని ప‌ట్టాలెక్కిస్తున్నారు. ఆ త‌ర్వాత `స‌లార్ -2` మొద‌ల‌వుతుంది.

దీనికి పేర్ల‌ల్ గానే `క‌ల్కి 2` కూడా మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. ఇదంతా పూర్త‌వ్వ‌డ‌నికి ఎలా లేద‌నా? మూడేళ్ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ గ్యాప్ లో నాగీ ఏం చేస్తాడు? అంటే ఓ చిన్న సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ఉప్పందింది. ఓ మంచి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడట‌. అందుకు త‌గ్గ స్టోరీ సిద్దంగా లేదు కానీ.... మంచి ల‌వ్ స్టోరీ రాసి దాన్ని ఆరేడు నెల‌ల్లో తీసి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడట‌.

ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యాన‌ర్లో చేయాల‌నుకుంటున్నారట‌. ఈ ఐడియా తోలుత రాజుగారితో నాగీ పంచుకున్నాడట‌. దీంతో మీరు రెడీ అంటే నేను రెడీ అంటూ రాజుగారు ముందుకొచ్చిన‌ట్లు నాగీ స‌న్నిహితుల నుంచి తెలిసింది. `క‌ల్కి 2` రిలీజ్ అవ్వ‌డానికి ఎలాగూ చాలా స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి ఈ గ్యాప్ లో మ‌రో సినిమా చేసి రిలీజ్ చేస్తే ఆడియ‌న్స్ కి ట‌చ్ లోనూ ఉన్న‌ట్లు ఉంటుంద‌ని నాగీ కూడా సీరియ‌స్ గానే థింక్ చేస్తున్నాడట‌.

Tags:    

Similar News