పెళ్లి తర్వాత కాపురం ముంబైలోనా? హైదరాబాద్ లోనా!
నాగచైతన్య-శోభిత ధూళిపాళ త్వరలో వివాహ బంధంతో ఒకటి కానున్నారు.
నాగచైతన్య-శోభిత ధూళిపాళ త్వరలో వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి ఎప్పుడు ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముహూర్తం కూడా పెట్టేసినట్లు తెలుస్తోంది. వైజాగ్ లోనే శోభిత తల్లిదండ్రులుంటున్నారు. ఇక్కడ పెళ్లికి ముందు జరిగే పసుపు దంచే కార్యక్రమం ముగించినట్లు తెలుస్తోంది. అనంతరం అదే రోజు సాయంత్రం శోభిత ముంబైకి వెళ్లిపోయింది.
పెళ్లికి అంతా రెడీ అన్నట్లే కెమెరాలకు ఓ సిగ్నెల్ పాస్ చేసింది. పసుపు దంచడం...శోభిత సిగ్నల్ రెండింట ఆధారంగా ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చేది కార్తీక మాసం కాబట్టి అది పెళ్లిళ్లకు మంచి సీజన్. కాబట్టి ఈ సీజన్ లో చైతన్య-శోభితల పెళ్లి తేది ఫిక్స్ చేసి ఉండొచ్చు. ఆ సంగతి పక్కనబెడితే! వివాహం తర్వాత కొత్త జంట కాపురం ఎక్కడ పెడుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరం.
ఎందుకంటే చైతన్య తెలుగు సినిమాలతో బిజీగా ఉంటాడు. కాబట్టి అతడు హైదరాబాద్ లోనే ఉండాలి. పైగా స్వస్థలం..ఇతర బిజినెస్ వ్యవహారాలు కూడా చైతన్య చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే చైతన్య హైదరాబాద్ వదిలి బయటకు పెద్దగా వెళ్లడు. కానీ శోభిత మాత్రం తెలుగు సినిమాలంటే బాలీవుడ్ పైనే ఆమె ఫోకస్ ఉంటుంది. ఆమె బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాలకు ప్రమోట్ అయిన నటి. అలాగే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది.
ఇలా శోభిత కెరీర్ ఎక్కువగా ముంబైతో ముడిపడి ఉంది. చైతన్యను పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో కాపురం పెడితే? ఆమె ముంబైకి తిరగాల్సి ఉంటుంది. అలా కాకుండా ముంబైలో కాపురం పెడితే నాగచైతన్య హైదరాబాద్ కి తిరగాల్సి ఉంటుంది. ఇది కోంచెం టఫ్ టాస్క్. మరి కొత్త కాపురం ఎక్కడ? అన్నది వివాహం తర్వాత ఆ జోడీ డిసైడ్ చేస్తుంది.