'కూలీ' ప్లాష్ బ్యాక్ లో నాగార్జున కింగ్ మేకర్!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` చిత్రం తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` చిత్రం తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. స్టోరీ లైన్ కూడా బయటకు వచ్చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న చిత్రమని లోకేష్ రివీల్ చేసాడు. ఇందులో రజనీ గోల్డ్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. లొకేష్ మార్క్ `ఖైదీ`, `విక్రమ్` తరహాలోనే మేకింగ్ ఉంటుందని అంతా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన మరో హింట్ లీక్ అయింది. ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకో కారణం ఉందంటున్నారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవ్వడంతో? ఈ సినిమా మూల కథాంశం కార్మికులకు సంబంధించిందని కొత్త అంశం తెరపైకి వచ్చింది. 1960 కార్మికుల నేపథ్యంలో కొన్ని ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ ప్లాష్ బ్యాక్ లో నాగార్జున పాత్ర చాలా బలంగా ఉంటుందిట.
నెవ్వర్ బిఫోర్ నాగార్జున తెరపైకి కనిపిస్తాడని అంటున్నారు. ఆ ప్లాష్ బ్యాక్ సన్నివేశాల్లోనే రజనీ-నాగ్ పాత్రలు నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటాపోటీగా ఉంటాయిట. నాగార్జున పాత్ర ప్రజెంట్ సిచ్వెషన్ కు అన్వయిస్తూ ఆ పాత్రకు కొనసాగింపుగా ఉపేంద్ర తెరపైకి వస్తుందిట. ఇదంతా ప్రజెంట్ లో నడిచే కథ అని అంటున్నారు. అదే నిజమైతే ప్రజెంట్ స్టోరీలో నాగార్జున పాత్ర ఉండదని తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. లోకేష్ సినిమాల్లో హీరోకు ఎలాగూ హీరోయిన్ ఉండదు. లియో లో విజయ్ ఇమేజ్ కోసం త్రిషను హీరోయిన్ గా పెట్టారు. కానీ కూలీలో ఆ ఛాన్స్ లేదు. సినిమాలో మాత్రం శ్రుతి హాసన్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. మెయిన్ ఫీమేల్ లీడ్ శ్రుతిదే. శోభిన సాహూర్, సత్యరాజ్ నటిస్తున్నారు. అమీర్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ పోషిస్తున్నారు.