చైతన్యని చూస్తే నాన్న గుర్తొచ్చారు..!
ఈవెంట్ లో భాగంగా నాగార్జున తన ఎనర్జిటిక్ స్పీచ్ తో ఫ్యాన్స్ ని అలరించారు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజై సూపర్ సక్సెస్ అయ్యింది. ఐతే ఈ సినిమా సక్సెస్ మీట్ నేడు హైదరాబాద్ లో జరిగాయి. ఈ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా కింగ్ నాగార్జున అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో భాగంగా నాగార్జున తన ఎనర్జిటిక్ స్పీచ్ తో ఫ్యాన్స్ ని అలరించారు.
మైక్ అందుకున్న నాగార్జున సక్సెస్ మీట్ కి వచ్చి చాలా రోజులు అవుతుందని అన్నారు. అరవింద్ గారు కథ విన్న వేళా విశేషం.. చందు తీద్దామన్న వేళా విశేషం.. డీఎస్పీ తో మ్యూజిక్ అనుకున్న వేళా విశేషం.. మిగతా టీం అందరి వేళా విశేషం.. చైతన్యని అడిగిన వేళా విశేషం.. చైతు శోభితని పెళ్లి చేసుకున్న వేళా విశేషం అన్ని బాగున్నాయి. తండేల్ సక్సెస్ చూస్తే చాలా సంతోషంగా ఉంది.
సినిమా రిలీజైన రోజు 7న ఢిల్లీలో పీఎం ని కలవడానికి వెళ్లాం. ఫోన్ లు ఆపేశాం. నా దగ్గర ఫోన్ లేదు. ఫోన్ ఆన్ చేయగానే కంగ్రాట్స్ మెసేజ్ లు వస్తున్నాయి. నా కన్నా చైతు కన్నా అక్కినేని అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంత ఆనందపడుతున్నారో అర్ధమైందని అన్నారు నాగార్జున.
ఈ సినిమా జరగడానికి ముందు అరవింద్ గారికి థాంక్స్. ఈ వయసులో మీరు లవ్ స్టోరీగా చూసి దాన్ని ఎక్కించడం చాలా గొప్ప విషయం. లవ్ స్టోరీగా ఎక్కించి దానికి ఏమేం కావాలో ఫెంటాస్టిక్ గా సెట్ చేశారని అన్నారు నాగార్జున. డైరెక్టర్, మ్యూజిక్, కెమెరా మెన్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేశారని అన్నారు నాగార్జున. ఇండియన్ సినిమాల్లో మొదటి 100 కోట్ల నిర్మాత అల్లు అరవింద్. గజినీ సినిమాతో ఆయన అది సాధించారని అన్నారు.
ఇందాక బన్నీ వాసు అన్నట్టుగా అల్లు అక్కినేని మంచి మాట.. మాకు బాగా సెట్ అయ్యిందని అన్నారు నాగార్జున. బన్నీ వాసు సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు అదే కమిట్ మెంట్ తో ఉన్నాడు. చందు అంటే చాలా ఇష్టమని అన్నారు నాగార్జున. తనలోని నటుడిని తీసుకొచ్చావ్ అన్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మాకు ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చాడు. దేవికి థాంక్ యు సో మచ్. సాయి పల్లవి ఇంక్రెడిబుల్. చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ బాగుంది. సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తే పది సాయి పల్లవిలు కనబడతారని అన్నారు నాగార్జున.
చైతన్య రెండేళ్లుగా ఈ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ నుంచి వచ్చినప్పుడల్లా రకరకాలుగా కనిపించాడు. కష్టంగా ఉందా అని అడిగితే.. క్యారెక్టర్ లోకి ఇప్పుడిప్పుడే వెళ్తున్నా అని అన్నాడు. రెండేళ్లు గడ్డం తో కనిపించాడు. ఒకరోజు సముద్రంలో షూట్ చేశాడు. చాలా కష్టంగా ఉందని అన్నాడని నాగార్జున చెప్పాడు.
చైతన్య గురించి మాట్లాడుతూ.. అందరు ఒక్క సీన్ గురించి మాట్లాడుతున్నారు. త్రూ అవుట్ సినిమా ఆ లుక్, నడక మొత్తం చాలా ఉన్నాయి. నాన్న గారి సినిమాలు చూస్తుంటాం కాబట్టి ఈ సినిమాలో చైతన్యని చూస్తే నాన్న గారు గుర్తొచ్చారని అన్నారు నాగార్జున. ఇక చివరగా 2025లో ఇది ముహూర్తం.. వస్తున్నాం అని నాగార్జున అనగా నాగ చైతన్యతోనే కొడుతున్నాం అనిపించారు నాగార్జున.