అరిగిన చెప్పులతో కల్కి డైరెక్టర్.. ఏం చెబుతున్నాడు?

సినీ ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త దర్శకులు పరిచయం అవుతూనే ఉంటారు.

Update: 2024-06-27 04:21 GMT

సినీ ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త దర్శకులు పరిచయం అవుతూనే ఉంటారు. కొందరు డెబ్యూతో మంచి హిట్ అందుకుంటారు. ఇంకొందరు మెల్లగా క్లిక్ అవుతుంటారు. మరికొందరు మాత్రం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలాంటి కోవకు చెందుతారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. రూ.4 వేల జీతం తీసుకుని కెరీర్ మొదలు పెట్టిన ఆయన.. ఇప్పుడు రూ.600 కోట్లతో సినిమా తీసిన స్థాయికి ఎదిగారు.

మహానటి మూవీ తర్వాత ఆయన చేసిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన ఆ సినిమా.. నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన విషయం తెలిసందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ అత్యంత ఎక్కువ బడ్జెట్ తో నిర్మించారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి కోసమే చర్చ నడుస్తోంది. కల్కి ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

తాజాగా నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ముక్కలు కూడా ఊడిపోయిన తన చెప్పుల పిక్ ను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. చాలా దూరం నడిచా.. ఇక్కడికి దాకా రావడానికి అని అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డట్లు పరోక్షంగా తెలిపారు. ఇటీవల రిలీజ్ అయిన ప్రీ లూడ్ వీడియోలో మూవీ కోసం ఐదేళ్లు వెచ్చించానని చెప్పారు నాగి. అయితే ఇప్పుడు కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు.

రిలీజైన అన్ని సెంటర్లలో కల్కి మూవీ సూపర్ రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈలలతో థియేటర్లు హోరెత్తుతున్నాయి. మహాభారతం, సైన్స్ ఫిక్షన్, భవిష్యత్ కాలాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతంగా చూపించారని నెటిజన్లు కొనియాడుతున్నారు. విజువల్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్ ఫిల్మ్ అని చెబుతున్నారు. మిత భాషి.. కానీ ఫుల్ టాలెంటెడ్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, అన్నా బెన్, మాళవిక నాయర్, శోభన, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఆర్జీవీ సహా ఎందరో నటీనటులు భాగమయ్యారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. హాలీవుడ్ నుంచి అనేక మంది రంగంలోకి దిగి వర్క్ చేశారు. మరి నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాలను మీరు చూశారా?

Tags:    

Similar News