బాలయ్య వారసుడి డెబ్యూకి 100 కోట్లు!
నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్క్ష ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే.
నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్క్ష ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. దర్శకుడిగా ప్రశాంత్ వర్మని రంగలోకి దించారు. ఇదే సినిమాతో బాలయ్య చిన్న కుమార్తే తేజస్విని నిర్మాతగా పరిచయం అవుతోంది. అయితో తానొక్కరే సోలోగా నిర్మించడం లేదు. చెరుకూరి సుధాకర్ తో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్- లెజెండ్ సినిమాస్ సంయుక్తంగా నిర్మాణం చేపడుతున్నాయి.
మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత అంటే? 100 కోట్లు అనే మాట వినిపిస్తుంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచే దీన్ని తెరకెక్కించే ప్లాన్ లో ఉండటంతో 100 కోట్లు అంచనా వేస్తున్నారు. సాంఘిక కథకు మైథాలజీని జోడించిన కథ గా వినిపిస్తుంది. పాన్ ఇండియాలోనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. మోక్షజ్ఞని సూపర్ హీరోగా లాంచ్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. హనుమాన్ తరహా ఫాంటసీ థీమ్ లో నే ఉంటుందని అంతా భావిస్తున్నారు.
అయితే మోక్షజ్ఞ డెబ్యూకి 100 కోట్లు పెట్టడం అన్నది ఎంత వరకూ నిజం అన్నది తెలియదు. ఒకవేళ పెడితే అది రిస్క్ అవుతుందా? అన్న సందేహాలు తె రపైకి వస్తున్నాయి. కానీ ఇక్కడ రిస్క్ అనే మాట ఉండకూడదు. మోక్షజ్ఞ నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే? ఇది చిన్న విషయం కాదు. తాతయ్య ఎన్టీఆర్ పెద్ద హీరో..ఆయన వారసత్వంతో బాలయ్య ఇండస్ట్రీకి చిన్నప్పుడే వచ్చేసారు.
ఇప్పుడు వాళ్లిద్దరి వారసత్వం పుణికి పుచ్చుకుని మోక్షజ్ఞ బరిలోకి దిగుతున్నాడు. అతడిపై ప్రేక్షకా భిమానుల్లో ఎన్నో అంచనాలున్నాయి. మోక్షజ్ఞ 100 శాతం హీరో మెటీరియల్ . అందులో ఎలాంటి డౌట్ లేదు. 100 కోట్లకు న్యాయం చేగల నటుడు. చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జాని పెట్టుకునే ప్రశాంత్ వర్మ 400 కోట్ల వసూళ్లు తెచ్చే సినిమా చేసాడు. అలాంటింది బాలయ్య వారసుడితో ఇంకే రేంజ్ లో అతడి ప్లానింగ్ ఉంటుందన్నది? చెప్పాల్సిన పనిలేదు. ఆ నమ్మకంతోనే తేజస్విని కూడా నిర్మాతగా పరిచయం అవుతున్నారు.