మోక్షజ్ఞ మూవీ ఫస్ట్‌ అప్‌డేట్‌..!

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మొదటి సినిమా కన్ఫర్మ్‌ అయింది.

Update: 2024-09-28 10:53 GMT

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మొదటి సినిమా కన్ఫర్మ్‌ అయింది. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ డం దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. మోక్షజ్ఞ బర్త్‌ డే సందర్భంగా ఇటీవల ఆ విషయాన్ని ప్రకటించారు. అంతే కాకుండా మోక్షజ్ఞ తాజా లుక్ ను సైతం రివీల్‌ చేయడంతో ఫ్యాన్స్ పిచ్చెక్కి పోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా ప్రారంభం అవుతుంది, సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ తో ప్రశాంత్ వర్మ సినిమా మొదలు కావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమా కోసం ప్రశాంత్‌ వర్మ స్క్రిప్ట్‌ వర్క్ చేస్తున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ను ఒక రొమాంటిక్‌ హీరో గా క్యూట్ లుక్ తో చూపించబోతున్నాడట. ప్రశాంత్‌ వర్మ ఇప్పటి వరకు తన సినిమాల్లో హీరోలను కాస్త రఫ్‌గా చూపించాడు. కానీ మోక్షజ్ఞ మొదటి సినిమాలో మాత్రం చాలా కూల్‌ అండ్ రొమాంటిక్ లుక్ లో చూపించబోతున్నాడట. సాధారణంగా అయితే నందమూరి ఫ్యాన్స్ అంతా మోక్షజ్ఞ ను మాస్‌ అవతార్ లో చూడాలి అనుకుంటున్నారు. కానీ ప్రశాంత్ వర్మ ఏం చేసినా కొత్తగా, హిట్ అయ్యేలా చేస్తాడు కనుక క్యూట్‌ లుక్‌ లో చూపించినా పర్వాలేదు అంటున్నారు.

హనుమాన్‌ సినిమా తర్వాత జై హనుమాన్ ను ప్రకటించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే ఆ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. మధ్యలో మోక్షజ్ఞ సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో రెండు సినిమాలు సమాంతరంగా చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏ దర్శకుడు సైతం అలా రెండు సినిమాలను ఒకే సారి చేస్తున్న దాఖలాలు లేవు. కానీ ప్రశాంత్‌ వర్మ మాత్రం అలానే చేస్తున్నాడు. ఆయన గతంలో సైతం సినిమాలు చేస్తూ కమర్షియల్స్‌ చేయడం, ఇతర ప్రాజెక్ట్‌ ల్లో తన సలహాలు ఇవ్వడం చేశారు. కనుక ఇప్పుడు రెండు ప్రాజెక్ట్‌ లు ఒకే సారి చేసినంత మాత్రాన ఇబ్బంది ఏమీ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మోక్షజ్ఞ మొదటి సినిమా లో బాలకృష్ణ తో లేదా నందమూరి కళ్యాణ్ రామ్‌ తో గెస్ట్‌ పాత్ర చేయించాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడట. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి అప్డేట్ రాలేదు. ముందు ముందు ఆ విషయమై ఏమైనా క్లారిటీ వస్తుందో చూడాలి. మోక్షజ్ఞ మొదటి సినిమా కావడంతో స్పెషల్‌ గెస్ట్ అప్పియరెన్స్ ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ప్రశాంత్‌ వర్మ ఆలోచన ఎలా ఉంది అనేది చూడాలి. ఇక మోక్షజ్ఞ తో నటించబోతున్న హీరోయిన్‌ ఎవరా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఒకరు ఇద్దరితో ప్రశాంత్ వర్మ ఈ విషయమై చర్చించాడనే సమాచారం అందుతోంది.

Tags:    

Similar News