ఆ యంగ్ హీరోలిద్దరి తర్వాత ఇతనే!
అదే లాజిక్ టాలీవుడ్ లో అనుకరించి సక్సెస్ అవుతున్నాడు. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'..'డీ పర్ దోడిడి'...'నేనొక్కడినే' లాంటి సినిమాల్లో నటించాడు
ట్యాలెంట్ కి టాలీవుడ్ పెద్ద పీట వేస్తోన్న సంగతి తెలిసిందే. సరైన సినిమా ఒకటి చేసి హిట్ కొడితే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా కెరీర్ సాగిపోతుంది. 'పెళ్లి చూపులు'.. 'అర్జున్ రెడ్డి'తో విజయ్ దేవరకొండ అలా స్టార్ అయిన వాడే. అలాగే అడవి శేషు కూడా ప్రతిభ పైకి వచ్చిన వాడు. తనలో మల్టీ ట్యాలెంటెడ్ స్కిల్స్ అదనంగా కలిసొచ్చాయి. నటనతో పాటు రైటింగ్ పై కూడా మంచి గ్రిప్ ఉండటం తో వేగంగా ఎదిగాడు.
తన సినిమాలకు తానే కథలు రాసుకుని వైవిథ్యంగా ప్రోజక్ట్ చేసుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో శేషు ది చాలా సుదీర్ఘమైన పోరాటం. ఎదగడానికి చాలా సమయం పట్టింది. కమర్శియల్ స్టార్ విజయ్ కి మంచి పేరొస్తే వైవిథ్యమైన కంటెట్ బేస్డ్ చిత్రాలు చేయాలంటే శేషునే ఆప్షన్ గా కనిపిస్తున్నారు. 'మేజర్' ..'హిట్' లాంటి సినిమాలు శేషుకి ప్రత్యేకమైన ఐడెంటిటీని తీసుకొచ్చాయి.
ఇదే కోవలో యువ నటుడు నవీన్ పోలిశెట్టి కనిపిస్తున్నాడు. అతడి ప్లానింగ్ ..కథలపై పట్టు చూస్తుంటే మంచి స్టార్ అవుతాడు అన్న అంచనాలు పెరుగుతున్నాయి. వాళ్లిద్దరి లాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన నటుడు. అయితే టాలీవుడ్ కంటే ముందే బాలీవుడ్ లో ఓ సినిమా చేసి..అక్కడ ప్రయత్నాలతో పరిశ్రమ ఎలా ఉంటుందన్నది అవపోశాన పట్టేసాడు.
అదే లాజిక్ టాలీవుడ్ లో అనుకరించి సక్సెస్ అవుతున్నాడు. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'..'డీ పర్ దోడిడి'...'నేనొక్కడినే' లాంటి సినిమాల్లో నటించాడు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. 'ఏజెంట్ ఆత్రేయ'తో హీరోగా పరిచయమయ్యాడు. అందులో నవీన్ నటనకి మంచి మార్కులుఎ పడ్డాయి. అటుపై 'జాతిరత్నాలు' సినిమాతో తెలుగు నాట బాగా ఫేమస్ అయ్యాడు.
ఇటీవల రిలీజ్ అయిన 'మిస్ శెట్టి...మిస్టర్ పొలిశెట్టి'తో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించాడు. ఈ సినిమా చూసిన తర్వాత నవీన్ కి పరిశ్రమలో మంచి భవిష్యత్ ఉందని ప్రశంసించిన వారెంతో మంది. సిద్దు జొన్నల గడ్డ..కిరణ్ అబ్బవరం,కార్తికేయ గుమ్మడి కొండ కూడా ఎలాంటి బ్యాకప్ లేకుండా ఎదుగుతోన్న వారే.