నయనతార అంత గట్టిగా నమ్మిందంటే..?

ఐతే నయనతార సినిమా బడ్జెట్ కన్నా కంటెంట్ ని నమ్ముతుంది. అందుకే ఆమె కెరీర్ ఎప్పటికీ అదే రేంజ్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది.

Update: 2024-12-24 19:30 GMT

సౌత్ లేడీ సూపర్ స్టార్ అంటే అందరు చెప్పే పేరు ఒక్కటే ఆమె నయనతార. కెరీర్ మొదట్లో చిన్న చిన్న అవకాశాలతో సరిపెట్టుకుని తర్వాత తన సత్తా ఏంటో కోలీవుడ్ బాక్సాఫీస్ కి చూపించింది అమ్మడు. కమర్షియల్ సినిమాలతో పాటు నయన్ సోలో సినిమాలకు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. నయన్ సినిమా వస్తుంది అంటే స్టార్ హీరోలు సైతం వెనక్కి తగ్గే రేంజ్ కి వెళ్లింది. ఐతే నయనతార సినిమా బడ్జెట్ కన్నా కంటెంట్ ని నమ్ముతుంది. అందుకే ఆమె కెరీర్ ఎప్పటికీ అదే రేంజ్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది.

మిగతా హీరోయిన్స్ లకు నయనతారకు తేడా ఏంటన్నది ఆమె ఎంపిక చేసుకుంటున్న కథలను బట్టే తెలుస్తుంది. ఐతే నయనతార ప్రస్తుతం తన సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. జవాన్ తో బాలీవుడ్ లోనూ హిట్ అందుకున్న ఈ అమ్మడు అక్కడ నుంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నా కూడా కాదనేస్తుంది. ఇదిలాఉంటే నయనతార ఇక మీదట ఫుల్ టైం నిర్మాతగా కూడా కొనసాగాలని ఫిక్స్ అయ్యిందట. తన సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ బ్యానర్ లో సినిమాలు చేయాలని అనుకుంటుందట.

ఈ బ్యానర్ లో లేటెస్ట్ గా ఒక స్టార్ సినిమా గురించి చర్చ మొదలైంది. నయనతారా నిర్మాతగా కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే హరి, విజయ్ సేతుపతి మధ్య కథా చర్చలు ముగిశాయని తెలుస్తుంది. నయన్ కూడా ఈ సినిమా బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటుందని టాక్.

విజయ్ సేతుపతి సినిమాలకు కూడా సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. అతను సినిమా చేస్తున్నాడు అంటే అందులో కచ్చితంగా విషయం ఉంటుంది. రీసెంట్ గా విడుదల 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ సేతుపతి అంతకుముందు మహారాజ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మహారాజ తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేసిన విజయ్ సేతుపతికి సరైన సినిమా పడితే పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడని ప్రూవ్ చేశాడు.

ఇక ఇప్పుడు హరి డైరెక్షన్ లో విజయ్ సేతుపతి సినిమా కూడా మాస్ యాక్షన్ అంశాలతో వస్తున్నా కథ కూడా అద్భుతంగా కుదిరిందని అంటున్నారు. నయనతార కాస్త బడ్జెట్ ఎక్కువ అయినా విజయ్ సేతుపతి కోసం రిస్క్ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. నయనతార అంత గట్టిగా నమ్మింది అంటే కచ్చితంగా అందులో సంథింగ్ స్పెషల్ ఉంటుందని కోలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు.

Tags:    

Similar News