ధనుష్ కి సపోర్ట్ తగ్గుతుందా..?
లేటెస్ట్ గా ఈ కేసు కోర్టులో హియరింగ్ కు రాగా ధనుష్ తరపున లాయర్ వాధించిన తీరు అందరిని షాక్ అయ్యేలా చేసింది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. స్టార్ హీరోయిన్ నయనతార మధ్య గొడవ తెలిసిందే. నయనతార తన పెళ్లి డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణంలో చేసిన నానుమ్ రౌడీ ధాన్ సినిమాలో కొన్ని సెకన్ల క్లిప్ వాడుకున్నారు. ఐతే దీనిపై ధనుష్ కోర్టులో కేసు వేశారు. నయనతార కూడా ధనుష్ ని టార్గెట్ చేస్తూ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ కేసు కోర్టులో హియరింగ్ కు రాగా ధనుష్ తరపున లాయర్ వాధించిన తీరు అందరిని షాక్ అయ్యేలా చేసింది.
డాక్యుమెంటరీలో వాడిన 28 సెకన్ల ఫుటేజీ నానుమ్ రౌడీ ధాన్ సినిమా టైం లో ధనుష్ ప్రొడక్షన్ లో నయనతార చేసిన ఒప్పందంలో మొదటి నియమమే అని.. దాన్ని ఉల్లంఘించారని లాయర్ వాదన వినిపించారు. అంతేకాదు నయనతార ధరించిన కాస్ట్యూమ్స్ తో పాటు ఈ సినిమాకు సంబందించిన అన్ని అంశాలు నిర్మాత ధనుష్ కాపీ రైట్స్ కలిగి ఉన్నారని లాయర్ చెప్పారు.
ఐతే ఫుటేజీ వరకు ఓకే కానీ మరీ కాస్ట్యూమ్స్ కూడా అంటూ సోషల్ మీడియాలో కొంత అసంతృప్తి వ్యక్త పరుస్తున్నాయి. ధనుష్, నయనతార లీగల్ ఫైట్ లో ఎవరికి వారు తమదే రైట్ అన్నట్టు వారి లాయర్లతో వాదన వినిపిస్తున్నారు. ఐతే ధనుష్ ఫుటేజీ సంగతి కాకుండా కాస్ట్యూమ్స్ విషయంలో కూడా రైట్స్ ఉన్నాయని చెప్పడం కాస్త షాకింగ్ గానే ఉంది. ఈ విషయంపై సొషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఈ ఇష్యూలో మొదట్లో ధనుష్ కి ఎక్కువ సపోర్ట్ వచ్చింది. నయనతార సినిమాలు చేస్తుంది కానీ ప్రమోషన్స్ కి కూడా రాదంటూ కొందరు ధనుష్ చేసిన పనికి సపోర్ట్ గా ఉన్నారు. ఐతే కాస్ట్యూమ్స్ విషయంలో కూడా నిర్మాతకు కాపీ రైట్స్ ఉండటం మాత్రం కాస్త షాకింగ్ గా అనిపిస్తుంది. ఈ కేసు విషయంలో ధనుష్ చిన్నగా ప్రజల మద్దతు కోల్పోతున్నాడని అనిపిస్తుంది. మరి కేసు ఫైనల్ తీర్పు ఏంటన్నది తెలియదు కానీ కేసు తమిళ సినీ పరిశ్రమ వాతావరణాన్ని దెబ్బ తీస్తుందని మాత్రం చెప్పొచ్చు. ఈ ఇష్యూని ఎవరు ఎప్పుడు ఎలా సాల్వ్ చేస్తారా అని కోలీవుడ్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. సినిమాల పరంగా అలరించిన స్టార్స్ ఇలా లీగల్ ఫైట్ చేస్తుంటే ఇరు వర్గాల ఫ్యాన్స్ కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.