తారక్ ఇక ముంబై వాలా?
డే అంతా షూటింగ్ నైట్ అయితే ముంబై కల్చర్ లో పూర్తిగా ఇడిమిపోయినట్లు కనిపిస్తుంది.
రోమ్ లో ఉంటే రోమన్ లా ఉండాలంటారు. మరి ముంబై వెళ్తే ముంబై వాలా అయిపోవాలా? అంటే అవుననే అనాలేమో! అవును ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. `వార్ -2` షూటింగ్ లో భాగంగా తారక్ ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. డే అంతా షూటింగ్ నైట్ అయితే పార్టీలంటూ ముంబై లో బాగానే చిల్ అవుతున్నారు. ఇటీవలే భార్యతో కలిసి ఓ రెస్టారెంట్ లో కనిపించిన సంగతి తెలిసిందే. అటుపై తారక్ ..కరణ్ జోహార్ పార్టీలోనూ ప్రత్యక్షమయ్యారు. ఇంకా `వార్ -2` టీమ్ తో సైతం తారక్ అంతే జోష్ తో కనిపిస్తున్నారు.
డే అంతా షూటింగ్ నైట్ అయితే ముంబై కల్చర్ లో పూర్తిగా ఇడిమిపోయినట్లు కనిపిస్తుంది. బాలీవుడ్ లో పార్టీ కల్చర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఇండస్ట్రీ ఎంతో పోష్ గా ఉంటుంది. వాణిజ్య రాజధాని అపై బాలీవుడ్ నెలకొన్న ప్రాంతం కాబట్టి అక్కడి కల్చర్ కి తగ్గట్టు మౌల్డ్ అవ్వాల్సిందే అన్నట్లుగా తారక్ కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో ఉంటే? ఉంటే షూటింగ్ సెట్లో..లేదంటే ఇంట్లో ఉంటారు. బయట ఇంకెక్కడా కనిపించరు. అప్పుడప్పుడు గెస్ట్ గా ఆహ్వానిస్తే ఆ వేదికలపై తప్ప ఇంకెక్కడా తారక్ దర్శనమనేది ఉండదు.
కానీ టైగర్ ఇప్పుడు ముంబై వీధుల్లో తిరిగేస్తోన్న వైనం చూస్తుంటే? ఇక్కడ మిస్ అయిదంతే అక్కడ ఆస్వాది స్తున్నట్లు కనిపిస్తున్నాడు. అక్కడ సెలబ్రిటీలతో బాగా మింగిల్ అయిపోతున్నాడు. వెనుక నుంచి కరణ్ జోహార్ నుంచి మంచి ప్రోత్సాహం ఉండటంతో సెలబ్రిటీలంతా స్నేహితులుగా మారిపోవడానికి పెద్దగా సమయం పట్టడం లేదు. గతంలో తారక్ స్నేహితుడు రామ్ చరణ్ కూడా హిందీలో సినిమా చేసాడు.
కానీ అతడు మాత్రం తారక్ అంత వేగంగా కనిపించలేదు. చరణ్ ముంబైకి ఎప్పటికప్పడు పనిమీద వెళ్తుంటాడు. అప్పుడు కూడా సెలబ్రిటీలతో కనిపించింది చాలా తక్కువ సందర్భాల్లోనే. మరి ఒక స్నేహితుడు స్పీడ్ గా..మరో స్నేహితుడు ఇంత నెమ్మదిగా ఉంటే ఎలా? వార్ -2 పూర్తయ్యేలోపు ఆ సినిమా సెట్స్ లో చరణ్ కనిపించం తధ్యమే. ఆరోజు ముంబై పబ్ ల్లో రచ్చ రచ్చేగా.