అసెంబ్లీ సమావేశాల తర్వాత వీరమల్లు బరిలోకి!
`హరి హర వీరమల్లు` రిలీజ్ సమయం దగ్గర పడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ తేదిని కూడా ప్రకటించారు.;
`హరి హర వీరమల్లు` రిలీజ్ సమయం దగ్గర పడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ తేదిని కూడా ప్రకటించారు. ఎట్టి పరిస్థుత్లో మార్చి 28న ప్రేక్షకులముందుకు తీసుకొస్తామని మేకర్స్ వెల్లడించారు. అంటే రిలీజ్ కి ఇంకా 23 రోజులు మాత్రమే సమయం ఉంది. అంటే ఈ లోపు పెండింగ్ షూటింగ్...పోస్ట్ ప్రొడక్షన్ , సెన్సార్ పనులు పూర్తి చేసుకుని రెడీగా ఉండాలి. కానీ ఈ సినిమాకి ఇంకా నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ డేట్లు ఇస్తేగానీ షూటింగ్ పూర్తి కాదు.
తాజాగా దానికి సంబంధించిన అప్ డేట్ అందుతోంది. ఈ సినిమా షూటింగ్ అమరావతి తాడేపల్లి లో తిరిగి షూటింగ్ ప్రారంభించుకుంది. ప్రస్తుతం సత్యరాజ్, ఈశ్వరీరావు లపై కీలక సన్నివేశాలు చిత్రీకరి స్తున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ షూట్ కి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలో షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
వాటికి డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. అనంతరం పవన్ కళ్యాణ్ వీరమల్లు కోసం నాలుగు రోజులు కేటాయిస్తాడు. పవన్ కళ్యాణ్ తోఔట్ డోర్ లో షూటింగ్ అంటే జరిగే పని కాదు. అందుకే తాడేపల్లిలో సెట్లు వేసి తొలి నుంచి షూటింగ్ చేస్తున్నారు. అవసరం మేర హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ చేసారు.
ఆ తర్వాత తాడేపల్లిలో మేజర్ పార్టు షూటింగ్ జరిగింది. ముఖ్యంగా పవన్ పై సన్నివేశాలు తాడేపల్లిలోనే జరిగాయి. ఇప్పుడు వాటికి కంటున్యూటీగానే నాలుగు రోజుల షూట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. పీకే నాలుగు రోజులు కేటాయిస్తే షూటింగ్ పూర్తయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ రేయింబవళ్లు కిందా మీదా పడి పూర్తి చేస్తారు. ఆ నమ్మకంతోనే మార్చి 28న రిలీజ్ పై ధీమాగా కనిపిస్తున్నారు.