పవన్ కళ్యాణ్ దర్శకులు.. సేఫ్ జోన్!

అలాగే సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ కూడా సెట్స్ పైనే ఉంది.

Update: 2024-02-09 04:38 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ముగ్గురు దర్శకులు ప్రాజెక్ట్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. హరిహరవీరమల్లు సినిమాని క్రిష్ చాలా కాలంగా చేస్తున్నారు. పీరియాడికల్ మూవీ కావడంతో దీనికోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కూడా ఈ సినిమాకి కొంత ఆటంకం కలిగిస్తోంది. అలాగే సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ కూడా సెట్స్ పైనే ఉంది. ఈ మూవీ 70 శాతం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశారు. మరల ఇప్పట్లో ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఈ దర్శకులు ముగ్గురు కూడా వేరే ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేసుకుంటున్నారు. ఒక్క సుజిత్ మాత్రమే పవన్ కళ్యాణ్ ఓ 15 రోజులు డేట్స్ ఇస్తే ఓజీ కంప్లీట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు.

క్రిష్ ఇప్పటికే అనుష్క లీడ్ రోల్ లో ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేయడానికి సిద్ధం అయిపోయాడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఆ సినిమా చేయనుంది. త్వరలో మూవీకి సంబందించిన ఎనౌన్సమెంట్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇక హరీష్ శంకర్ రవితేజ తో మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు. దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని బాలకృష్ణతో చేయడానికి కథ కూడా చెప్పేసి ఒకే చేయించుకున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సుజిత్ మళ్ళీ డివివి దానయ్య ప్రొడక్షన్ లోనే నానితో ఒక గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయబోతున్నాడంట. ఇప్పటికే నానికి కథ చెప్పాడంట. అతను కూడా ఒకే చెప్పేసాడని తెలుస్తోంది. ఓజీ కంప్లీట్ అయిన వెంటనే నానితో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే క్రిష్ పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న హరిహర వీరమల్లు షూటింగ్ ఎన్నికలు పూర్తయిన తర్వాత స్టార్ట్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఎప్పుడు ఉంటుందనేది చెప్పలేం. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే మళ్ళీ స్టార్ట్ అవ్వొచ్చని ఇండస్ట్రీ వర్గాలలో నడుస్తోన్న ప్రచారం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తోన్న ఈ ముగ్గురు దర్శకులు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఫైనల్ అయిపోయాయి. కానీ ఆయనతో కమిట్ అయినవి మాత్రం థియేటర్స్ లోకి రావడం ఆలస్యం అవుతోంది.

Tags:    

Similar News