త్రివిక్రమ్ ని బ్యాన్ చేయండి చూద్దాం! పూనమ్ కౌర్
సంతోషం వార పత్రిక అధినేత..నిర్మాత సురేష్ కొండేటిని బ్యాన్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే
సంతోషం వార పత్రిక అధినేత..నిర్మాత సురేష్ కొండేటిని బ్యాన్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని సురేష్ ఖండిచడం జరిగింది. తనపై కావాలనే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నా రని..తనని ఎవరూ బ్యాన్ చేయలేదని...ప్రస్తుతం తీర్ద యాత్రల్లో ఉన్నానని...31 ఏళ్లగా జర్నలిస్ట్ గా ఉన్నానని త్వరలోనే తిరిగొస్తానని వివరణ ఇచ్చారు. గోవాలో ఆయన నిర్వహించిన అవార్డుల వేడుక కార్యక్రమంలో తలెత్తిన సమస్యలు.. సెలబ్రిటిల్నీ ఇరకాటంలో పెట్టే ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నారు అన్న కారణంగానే బ్యాన్ చేస్తున్నట్లు ప్రచారం సాగింది.
తాజాగా ఈ ప్రచారానికి ప్రతి స్పందనగా పూనమ్ కౌర్ ఓ స్టేటస్ పోస్ట్ చేసింది అని ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియా లో వైరల్ అవ్వుతుంది . 'సంతోషం' సురేష్ ని నిషేధించడం సులభం. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని నిషేధించండి. శక్తి లేని వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం కాదు.. అలాంటి బలమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ వ్యక్తం చేసే ప్రయత్నం కనిపించింది. దీంతో పూనమ్ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఇక పూనమ్ కౌర్-త్రివిక్రమ మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ను ఉద్దేశించి పూనమ్ చాలా సందర్భాల్లో సంచలన ఆరోపణలు చేసారు. నెట్టింట వాటిపై వాడి వేడి చర్చ సాగింది. ఈ వివాదం ఏపీ రాజకీయాల్లో సైతం హాట్ టాపిక్ గా మారింది. పవన్ వ్యతిరేక వర్గం పూనమ్ ని తెరపైకి తీసుకొచ్చి లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆ సమయంలో పూనమ్ కూడా అంతే ధీటుగా స్పందించింది.
నొప్పి దెబ్బ తగిలిన వారికే తెలుస్తుందని...గాయం లేకుండా నొప్పి అని నటించే వారిని సమాజం నమ్మదని వ్యాఖ్యానించింది. ఇక పూనమ్ కౌర్ చాలా కాలంగా హైదరాబాద్ లోనే ఉంటుంది. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా ఇక్కడే స్థిరపడినట్లు తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు.