ప్రభాస్ నుంచి అదిరిపోయే ట్రీట్స్.. గెట్ రెడీ!
ఇండియాలోనే అత్యధిక మార్కెట్ ఉన్న నెంబర్ వన్ హీరోగా డార్లింగ్ ప్రభాస్ ఉన్నారు. ఎలాంటి కథ ఓకే చేసినా వందల కోట్ల బడ్జెట్ తో మేకర్స్ సినిమాలు చేస్తున్నారు.
ఇండియాలోనే అత్యధిక మార్కెట్ ఉన్న నెంబర్ వన్ హీరోగా డార్లింగ్ ప్రభాస్ ఉన్నారు. ఎలాంటి కథ ఓకే చేసినా వందల కోట్ల బడ్జెట్ తో మేకర్స్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ కూడా సినిమా సినిమాకి కంటెంట్ పరంగా వేరియేషన్ ఉండేలా చూసుకుంటూ స్ట్రాంగ్ గా కెరియర్ బిల్డ్ చేసుకున్నారు. ఇప్పటికే మిగిలిన స్టార్స్ ఎవరు కూడా ప్రభాస్ ఇమేజ్ దగ్గరకి రాలేకపోవచ్చనే మాట వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక్క ‘కన్నప్ప’లో మాత్రమే ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. మిగిలిన సినిమాలు అన్ని కూడా పూర్తిస్థాయి హీరోగా తెరకెక్కుతున్నవే కావడం విశేషం. మారుతి దర్శకత్వంలో చేస్తోన్న ‘ది రాజాసాబ్’ షూటింగ్ ఫైనల్ దశలో ఉంది. ఈ సినిమాని జూన్ లేదా జులై లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో డార్లింగ్ ప్రభాస్ రుద్రుడుగా కనిపించబోతున్నాడు. అతని పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ రీసెంట్ గా వచ్చింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ నెల, రెండు నెలల వ్యవధిలోనే థియేటర్స్ లోకి రాబోతున్నాయి.
అంటే ప్రభాస్ లైన్ అప్ లో ఉన్న ఆరు ప్రాజెక్ట్స్ లలో రెండు ఈ ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ దశలో ఉంది. త్వరలో ఈ మూవీ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరులో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీ పట్టాలు ఎక్కనుంది.
ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో నాగ్ అశ్విన్ ‘కల్కి 2898ఏడీ’ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ‘సలార్’ సినిమాని స్టార్ట్ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లానింగ్ లో ఉన్నారు. ‘ఫౌజీ’ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘స్పిరిట్’ మూవీని 2027లో సందీప్ రెడ్డి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
అలాగే ‘కల్కి’ కూడా 2027 ఆఖరులో లేదంటే 2028 ఆరంభంలో రావొచ్చని అనుకుంటున్నారు. ఏది ఏమైన డార్లింగ్ అభిమానులకి అయితే ఈ ఏడాది రెండు సినిమాలతో అదిరిపోయే ట్రీట్ లభించబోతోందని అర్ధమవుతోంది. ‘ది రాజాసాబ్’ అవుట్ అండ్ అవుట్ హర్రర్ కామెడీ జోనర్ లో రాబోతోంది. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ ప్రభాస్ కామెడీని ఈ సినిమాలో ఆస్వాదించబోతున్నారు.