2027 లోనే సలార్ 2..?
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మొదటి పార్ట్ కమర్షియల్ గా బాగానే వర్క్ అవుట్ అయ్యింది.
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మొదటి పార్ట్ కమర్షియల్ గా బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఐతే కె.జి.ఎఫ్ రేంజ్ లో సినిమా రాలేదన్న టాక్ అయితే ఉంది. ప్రభాస్ లాంటి కటౌట్ కి తగిన సినిమానే అయినా సలార్ 1 ని ఎందుకో కె.జి.ఎఫ్ పైన ఉంచలేకపోయారు. ఐతే ప్రశాంత్ నీల్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ సలార్ 2 నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని వెల్లడించాడు. సలార్ 2 కచ్చితంగా ఊహించిన దాని కన్నా భారీగా ఉండబోతుంది.
ఐతే ప్రస్తుతం ప్రభాస్ మారుతితో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు హనుతో ఆల్రెడీ ఫౌజీని మొదలు పెట్టాడు. ఇక లైన్ లో సందీప్ వంగ స్పిరిట్ కూడా ఉంది. ప్రభాస్ తో కల్కి 2 సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడు. ఎలాగు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ప్రభాస్ ఈలోగా ఈ ప్రాజెక్ట్ లను పూర్తి చేసే అవకాశం ఉంది.
ఈ లెక్కన చూస్తే ప్రశాంత్ నీల్ ప్రభాస్ సినిమా 2026 కూడా కాదు 2027 లోనే సెట్స్ మీదకు వెళ్లేలా ఉంది. ప్రశాంత్ నీల్ కచ్చితంగా తారక్ సినిమా పూర్తి చేశాకనే అది ఉంటుంది. సలార్ 2 విషయంలో తన కమిట్మెంట్ ఐడియాలజీ ఏంటన్నది సలార్ 1 వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ తెలిపాడు. సో సలార్ 1 కన్నా సలార్ 2 చాలా పెద్దగా ఉండబోతుంది. ఐతే అది ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం.
సెట్స్ మీద ఉన్న ప్రభాస్ సినిమాల రిలీజ్ అంచనాలు చూస్తే ఈ ఇయర్ రాజా సాబ్ ఒక్కటే వచ్చే ఛాన్స్ కనబడుతుంది. స్పిరిట్ కన్నా ఫౌజీ ఎక్కువ స్పీడ్ గా షూట్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఫౌజీ రిలీజ్ ఉండొచ్చు. ఆ నెక్స్ట్ స్పిరిట్ లేదా కల్కి 2 వస్తుంది. ఇక స్పిరిట్ ని కూడా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ 2 కి డేట్స్ ఇస్తాడు. సో ఈ సినిమాలన్నీ పూర్తి చేసేదాకా రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూడక తప్పదు.