రాజాసాబ్'గా ప్రభాస్.. ఇది ఊహించలేదు డార్లింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అని చాలాకాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Update: 2024-01-15 04:06 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అని చాలాకాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టును మొదట ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా స్టార్ట్ చేశారు. షూటింగ్ ఎంత స్పీడ్ గా కొనసాగుతున్న కూడా ఇలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ లో అయితే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది.


అసలు ఎందుకు ఇంత సైలెంట్ గా ఈ సినిమాలో మొదలుపెట్టారు? అలాగే ఎందుకు ఇలాంటి అప్డేట్ ఇవ్వకుండా షూటింగ్ కొనసాగిస్తున్నారు? అనే అనుమానాలు చాలానే వచ్చాయి. అయితే సరైన సమయం చూసి ఈ ప్రాజెక్టులు పై అప్డేట్ ఇవ్వాలి అని దర్శకనిర్మాతలు అనుకున్నారు. ఇక మొత్తానికి ఇప్పుడు సంక్రాంతి కానుకగా సినిమాకు సంబంధించిన ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు.

సినిమాకు రాజాసాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ పోస్టర్లో ప్రభాస్ గతంలో ఎప్పుడు లేనివిధంగా ఒక మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. గతంలో కూడా ప్రభాస్ మాస్ క్యారెక్టర్ చాలానే చేశాడు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చిన తర్వాత కాస్త క్లాస్ లేదా ఐ వోల్టేజ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. అయితే ప్రభాస్ ఎప్పటి నుంచో ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక మొత్తానికి ఇప్పుడు మారుతి దర్శకత్వంలో సరికొత్తగా రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక రాజాసాబ్ పోస్టర్లో ప్రభాస్ లుంగీ పైకెత్తి కడుతున్నట్లు చిన్న చిరునవ్వుతో మంచి స్టిల్ అయితే ఇచ్చాడు. ఇక ఈ పోస్టర్ అయితే ఓ వర్గం మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దర్శకుడు మారుతి ఈ సినిమాను హారర్ కామెడీ జానర్ లో వెండి తెరపైకి తీసుకురాబోతున్నాడు. గతంలో మారుతి ఈ తరహా కంటెంట్ తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు.

కాబట్టి తప్పకుండా రాజాసాబ్ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని నిర్మాతలు ఇదివరకే తెలియజేశారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఊహించినట్టే ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రభాస్ తో సినిమా చేయాలి అని కూడా థమన్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మొత్తానికి అతనికి సరైన అవకాశం దొరికింది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా మిగతా భాషల్లో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News