సలార్ వెనకా, ముందు వచ్చేవి ఇవే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సలార్.

Update: 2023-09-30 04:22 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తీసుకురానున్నారు. అందులో పార్ట్ 1 డిసెంబర్ 22న రిలీజ్ కానున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ కావడం వలన వాయిదా పడింది.

ఇదిలాఉంటే ఇప్పుడు సలార్ సినిమాకి పోటీగా షారుఖ్ ఖాన్ డుంకీ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సలార్ చిత్రానికి ముందు, వెనుక రాబోయే సినిమాల సంగతి చూసుకుంటే సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబోలో తెరకెక్కుతోన్న యానిమల్ డిసెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రంపైన అంచనాలు హ్యూజ్ లో ఉన్నాయి. తరువాత డిసెంబర్ 7న నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోంది.

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ డిసెంబర్ 9న రిలీజ్ అవుతుందని చెప్పిన కూడా వాయిదా పడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. జనవరి 22కి షిఫ్ట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. ధనుష్ పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ డిసెంబర్ 15న రిలీజ్ కాబోతోంది. అతని కెరియర్ లో భారీ బడ్జెట్ తో సిరీస్ గా కెప్టెన్ మిల్లర్ సినిమా తెరకెక్కుతోంది. మూవీ

నితిన్ ఎక్స్ ఆర్డినరీ మూవీ అఫీషియల్ డేట్ కన్ఫర్మ్ కాలేదు డిసెంబర్ లేదా జనవరి 26న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.డిసెంబర్, జనవరి నెలల్లో రాబోయే అన్ని సినిమాల మీద ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. కచ్చితంగా బ్లాక్ బస్టర్స్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

సంక్రాంతి రేసులో అయితే గుంటూరు కారం, హనుమాన్, నా సామి రంగా, రవితేజ ఈగల్ సినిమాలు ఉన్నాయి. అలాగే విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ రిలీజ్ ఎప్పుడనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం కూడా డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News