అప్పుడు రజినీకాంత్… ఇప్పుడు ప్రభాస్

డార్లింగ్ ప్రభాస్ స్టార్ హోదాలో ఇప్పుడు ఎవ్వరూ అందుకోలేనంత హైట్స్ లో ఉన్నాడు

Update: 2024-08-01 04:03 GMT

డార్లింగ్ ప్రభాస్ స్టార్ హోదాలో ఇప్పుడు ఎవ్వరూ అందుకోలేనంత హైట్స్ లో ఉన్నాడు. మార్కెట్ పరంగా బాలీవుడ్ స్టార్స్ అయిన ఖాన్ త్రయం కూడా ప్రభాస్ కి పోటీగా లేరని చెప్పొచ్చు. అంతగా ఇండియన్ బాక్సాఫీస్ ని డార్లింగ్ శాసిస్తున్నారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే మిగిలిన హీరోలు ఆటోమేటిక్ గా సైడ్ అయిపోతున్నారు. కాదని పోటీలో ఉంటే పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా కూడా కమర్షియల్ ఫ్లాప్ కావడం గ్యారెంటీ అని నిర్మాతలు భావిస్తున్నారు.

డార్లింగ్ ప్రభాస్ మూవీ రిలీజ్ తర్వాత కనీసం రెండు వారాలు అతని హవా ఉంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. అందుకే ప్రభాస్ సినిమాలతో పోటీ పడే ప్రయత్నం ఎవరు చేయడం లేదు. ఇదిలా ఉంటే ఈ స్థాయిలో హీరోగా ప్రభాస్ ఇమేజ్ ఉన్న కూడా ఒకే తరహాలో సేఫ్ జోన్ లో మూవీస్ చేయాలనే ఆలోచనలో ప్రభాస్ లేరు. సినిమా సినిమాకి కథల పరంగా డిఫరెన్స్ చూపిస్తున్నారు. ప్రతి సినిమాకి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.

తాజాగా రిలీజ్ అయిన కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా 1100 కోట్లకి పైగా కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. ఈ మూవీ బజ్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లే అని చెప్పాలి. నెక్స్ట్ డార్లింగ్ నుంచి రాబోయే ది రాజాసాబ్ సినిమాపై ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ పెరిగింది. రీసెంట్ గా మూవీ గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీనికి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. ఈ గ్లింప్స్ లో డార్లింగ్ ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడనే మాట వినిపిస్తోంది. కచ్చితంగా ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ప్రత్యేకంగా ఏదో చెప్పబోతున్నాడని అందరూ భావిస్తున్నారు.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రొమాంటిక్ హర్రర్ కామెడీ కథాంశంతో సిధ్దం అవుతుందంట. ఇండియన్ నెంబర్ వన్ హీరోగా టాప్ చైర్ లో ఉన్న సమయంలో హర్రర్ కామెడీ జోనర్ లో సినిమాలు చేసిన నటులు ఇద్దరే కనిపిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలోనే ఊహించని విధంగా చంద్రముఖి సినిమాలో నటించాడు. 2005 లో వచ్చిన ఆ సినిమా హర్రర్ జోనర్ లో తెరకెక్కింది. అది కూడా రీమేక్ చిత్రం కావడం విశేషం.

ఈ సినిమా సూపర్ స్టార్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మరల డార్లింగ్ ప్రభాస్ ఇండియన్ నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలో హర్రర్ జోనర్ లో ది రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఇప్పటి వరకు చేసిన సినిమాలకి భిన్నమైన కథతో తెరకెక్కుతోంది. హర్రర్ కామెడీ అవుట్ డేటెడ్ అని అందరూ భావిస్తున్న సమయంలో ఆ జోనర్ లో మూవీ అంటే ప్రభాస్ పెద్ద రిస్క్ తీసుకున్నాడని చెప్పొచ్చు. అయితే మారుతికి ఇలాంటి కథలతో హిట్ కొట్టిన అనుభవం ఉంది కాబట్టి ది రాజాసాబ్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.

Tags:    

Similar News