సింగీతం మాట ఇప్పుడు నిజమవుతోంది!
ఒక్క హిట్ తో ప్రశాంత్ రేంజ్ మారిపోయింది. బెంజ్ నుంచి రేంజ్ రోవర్ కి ప్రమోట్ అయ్యాడు. అవకాశాల పరంగా నిర్మాతలే క్యూలో ఉన్నారు.
'హనుమాన్' విజయంతో యంగ్ మేకర్ ప్రశాంత్ వర్మ పేరిప్పుడు పాన్ ఇండియాలో మారు మ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. ఒక్క హిట్ తో ప్రశాంత్ రేంజ్ మారిపోయింది. బెంజ్ నుంచి రేంజ్ రోవర్ కి ప్రమోట్ అయ్యాడు. అవకాశాల పరంగా నిర్మాతలే క్యూలో ఉన్నారు. అడ్వాన్సులు చేతిలో పట్టుకుని ఎంత అడిగితే అంత ఇచ్చి లాక్ చేయాలని చూస్తున్నారు. టాలీవుడ్ నుంచే కాదు..బాలీవుడ్ నుంచి కూడా అగ్ర నిర్మాణ సంస్థలు క్యూలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
ట్యాలెంట్ ..సక్సెస్ ఎక్కడ ఉంటే? అక్కడ అంతా ఉంటారని మరోసారి ప్రశాంత్ వర్మ తో రుజువైంది. ఒక ప్పుడు కోటి రూపాయలు పెట్టడానికి ముందుకు రాని నిర్మాత ఇప్పుడు వందల కోట్లు గుమ్మరించడానికి రెడీగా ఉన్నారు. అది ట్యాలెంట్ కి ఉన్న ఫవర్. తాజాగా 'హనుమాన్' రిలీజ్ తర్వాత తొలిసారి ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు రివీల్ చేసాడు.
'టీజర్ ... ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ సమయానికి థియేటర్లు పెద్దగా దొరకలేదు. దాంతో ఈ సినిమాను తప్పకుండా హిట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆడియన్స్ వచ్చారు . వచ్చిన తరువాత కనెక్ట్ అయ్యారు. నార్త్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. ఈ సినిమా ఒక్కోరోజు ఒక్కో రికార్డును క్రియేట్ చేస్తుంటే నాకు ఇదంతా ఒక కలగా అనిపించేది.
ఈ సినిమా ఒక స్థాయిని దాటేసిన తరువాత మాత్రం ఇదంతా హనుమంతుడే చేయిస్తున్నాడనే ఒక నమ్మకం కలిగింది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత సింగీతం శ్రీనివాసరావుగారు కాల్ చేసి సక్సెస్ ను హ్యాండిల్ చేయడం చాలా కష్టమని చెప్పారు. ఆయన అలా ఎందుకన్నారనేది నాకు ఆ తరువాత అర్థమవు తూ వస్తోంది' అని అన్నాడు.