'పుష్ప 2' క్లైమాక్స్.. ఇంతకీ ఇద్దరిలో బీజీఎం ఇచ్చింది ఎవరు?

ఈ మూవీ క్లైమాక్స్ కి దేవిశ్రీ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లుగా డైరెక్టర్ సుకుమార్ తెలిపారు.

Update: 2024-12-03 10:42 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. అందరూ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన ఈ క్రేజీ సీక్వెల్, మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక బీజీఎమ్ విషయంలో అనేక వార్తలు ప్రచారంలో ఉన్న తరుణంలో.. ఈ మూవీ క్లైమాక్స్ కి దేవిశ్రీ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లుగా డైరెక్టర్ సుకుమార్ తెలిపారు.

హైదరాబాద్ లో జరిగిన 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ జాతర ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో డీఎస్పీని ఉద్దేశిస్తూ సుకుమార్ మాట్లాడుతూ ''దేవిశ్రీ ప్రసాద్.. లవ్ యూ. ఎవరైనా నా జీవితంలోకి వచ్చారంటే, వారితో నా జర్నీ అలా సాగుతూనే ఉంటుంది. నేను ప్రేమించే వారితో ప్రేమతోనే వర్క్ చేయగలను. డార్లింగ్ లవ్ యూ సో మచ్. నువ్వు క్లైమాక్స్ కి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతం. నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్లావ్. థ్యాంక్యూ సో మచ్'' అని అన్నారు. దీంతో ‘పుష్ప 2: ది రూల్’ క్లైమాక్స్ కి దేవిశ్రీనే బీజీఎమ్ కంపోజ్ చేసినట్లుగా అందరికీ స్పష్టమైంది. అయితే ఇప్పుడు సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కూడా ‘పుష్ప 2’ క్లైమాక్స్ కోసం వర్క్ చేసినట్లు ట్వీట్ చేయడంతో గందరగోళం ఏర్పడింది.

''పుష్ప-2లో ఇది నాకు అద్భుతమైన ప్రయాణం. నన్ను పరిగణలోకి తీసుకున్నందుకు మరియు BGMలో పనిచేసిన ఈ అద్భుతమైన అనుభవాన్ని నాకు అందించినందుకు మైత్రీ మూవీ మేకర్స్ కి ధన్యవాదాలు. నా నిర్మాతలు రవి శంకర్, నవీన్ యెర్నేని, చెర్రీ సపోర్ట్.. వారి నమ్మకం లేకుండా ఇది సాధ్యం కాదు. అల్లు అర్జున్ సార్ కి ధన్యవాదాలు. మీకు బీజీఎమ్ స్కోర్ చేయడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇది నిజంగా ఫైర్. ఈ మాగ్నమ్ ఓపస్‌లో దర్శకుడు సుకుమార్ సర్ తో కలిసి పని చేసినందుకు నేను గ్రేట్ ఫుల్ గా ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా పవర్ ప్యాక్డ్ ఫైట్ సీన్స్ & క్లైమాక్స్‌లో పని చేయడం ఒక భిన్నమైన అనుభవం. నాకు మద్దతుగా నిలిచిన ఎడిటర్ నవిన్ నూలి బ్రోకి చాలా థ్యాంక్స్. నా టీమ్ కి ధన్యవాదాలు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న పుష్ప-2 వైల్డ్ ఫైర్ ను మీకు సమీపంలోని థియేటర్‌లలో చూడండి'' అని సామ్ సీఎస్ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి డీఎస్పీని మినహా మిగతా అందరినీ ట్యాగ్ చేసారు.

'పుష్ప 2: ది రూల్' క్లైమాక్స్ కి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని సుకుమార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా చెప్పిన తర్వాత, ఇప్పుడు తాను క్లైమాక్స్‌కి వర్క్ చేసినట్లు సామ్ సీఎస్ పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ‘పుష్ప 2’ మూవీ కోసం దేవిశ్రీతో పాటుగా మరో ఎస్. థమన్, సామ్ సీఎస్, అజనీష్ లోక్ నాథ్ వంటి మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేశారు. అయితే సినిమా మొత్తానికి కాకుండా ఫస్టాఫ్ లో కొన్ని పోర్షన్స్ కు మాత్రమే బ్యాగ్రౌండ్ స్కోర్ చేసినట్లుగా థమన్ క్లారిటీ ఇచ్చారు. సినిమాలో జాతర ఎపిసోడ్ కి బీజీఎమ్ చేసినట్లుగా హింట్ ఇస్తూ సామ్ ఇటీవల ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు పవర్ ప్యాక్డ్ ఫైట్ సీన్స్ తో పాటుగా క్లైమాక్స్‌కి కూడా పని చేసినట్లుగా చెబుతున్నారు.

'పుష్ప 2' క్లైమాక్స్‌కి సామ్ సీఎస్ బీజీఎమ్ కంపోజ్ చేస్తే, దేవిశ్రీ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లుగా స్వయంగా డైరెక్టర్ సుకుమారే ఎందుకు చెప్తాడు? ఇంతకీ ఇద్దరిలో ఎవరు వర్క్ చేసారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. సినిమాలో జాతర సీక్వెన్స్ హైలైట్ గా నిలవబోతోందని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అలాంటి కీలకమైన ఎపిసోడ్ కి సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసినప్పుడు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరూ ఆయన పేరుని ఎందుకు ప్రస్తావించలేదు? అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మ్యూజిక్ క్రెడిట్ మొత్తం దేవిశ్రీ ప్రసాద్ కి ఇస్తున్నందుకే సామ్ ఈ ట్వీట్ పెట్టి ఉంటాడని కొందరు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం క్లైమాక్స్‌కి సామ్ వర్క్ చేసినప్పటికీ , చివరకు దేవిశ్రీ కొట్టిన బీజీఎమ్ నే ఉంచారేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

'పుష్ప 2' సినిమాకి ఎవరెవరు వర్క్ చేశారనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. టైటిల్ క్రెడిట్స్‌లో థమన్, సామ్, అజనీష్ పేర్లు కనిపిస్తే వాళ్ళు ఇచ్చిన ఆర్ఆర్ సినిమాలో ఉన్నట్లు. అలా కాకుండా క్రెడిట్స్‌లో దేవిశ్రీ ప్రసాద్ పేరు మాత్రమే ఉంటే, ఆయనే ఈ సినిమాకి సోలో మ్యూజిక్ డైరెక్టర్ అని భావించాలి.

Tags:    

Similar News