మరో ఖాన్ ను బీట్ చేసిన బన్నీ

దేశ వ్యాప్తంగా ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్ల పర్వం కొనసాగిస్తోంది.

Update: 2024-12-16 09:19 GMT

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పుష్పరాజ్ హవా నడుస్తోంది. హై ఎక్స్ పెక్టేషన్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పుష్ప 2’ కచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. అయితే ఈ వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని కేవలం 6 రోజుల్లోనే వసూళ్లు చేస్తుందని ఎవ్వరు ఊహించలేదు. ‘బాహుబలి 2’ తర్వాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఆ రేంజ్ లో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న ఏకైక చిత్రం ‘పుష్ప 2’ అని చెప్పాలి.

దేశ వ్యాప్తంగా ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్ల పర్వం కొనసాగిస్తోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఏకంగా 13 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కేవలం 11 రోజుల్లోనే అందుకుంది. తద్వారా అమీర్ ఖాన్ ‘దంగల్’ నార్త్ ఇండియా కలెక్షన్స్ రికార్డ్ ని ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. ఇక నార్త్ లో అత్యధిక కలెక్షన్స్ చిత్రాల జాబితాలో కూడా పుష్పరాజ్ గాడి హవా స్పష్టంగా కనిపిస్తోంది.

ఒక్కో సినిమాని దాటుకుంటూ టాప్ చైర్ లోకి ఈ చిత్రం వెళ్ళిపోతోంది. నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాల జాబితాలో ఈ మూవీ టాప్ 7లో ఉంది. ‘బాహుబలి 2’ మూవీ 22 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో టాప్ 1గా ఉంది. దీని తర్వాత 18.57 మిలియన్ డాలర్స్ తో ‘కల్కి 2898ఏడీ’ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రం 17.49 మిలియన్ డాలర్స్ తో నిలిచింది.

లాంగ్ రన్ లో ‘పుష్ప 2’ మూవీ ఈ మూడు స్థానాలలో ఏదో ఒకటి కచ్చితంగా అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మేగ్జిమమ్ టాప్ 2లో ఉన్న ‘కల్కి’ సినిమా కలెక్షన్స్ ని ఈ మూవీ బ్రేక్ చేసే ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఇక ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకున్న నార్త్ అమెరికాలో ‘పుష్ప 2’ మూవీ 103+ కోట్ల వరకు వసూళ్లు చేసింది.

అక్కడ ప్రేక్షకుల నుంచి ఇంకా రెస్పాన్స్ వస్తూ ఉండటంతో క్రిస్మస్ వీకెండ్ వరకు ఈ సినిమా సందడి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇక ఓవరాల్ గా కూడా 1500 కోట్లకి పైగా కలెక్షన్స్ ని ఈ చిత్రం వసూళ్లు చేసి హైయెస్ట్ గ్రాసర్ చిత్రాల జాబితాలో మూడో స్థానంలోకి వచ్చే ఛాన్స్ ఉందని ట్రెండ్ పండితులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

బాహుబలి 2 – 22 మిలియన్ డాలర్స్

కల్కి 2898ఏడీ – 18.57 మిలియన్ డాలర్స్

పఠాన్ – 17.49 మిలియన్ డాలర్స్

ఆర్ఆర్ఆర్ – 15.34 మిలియన్ డాలర్స్

జవాన్ – 15.23 మిలియన్ డాలర్స్

యానిమల్ – 15.01 మిలియన్ డాలర్స్

పుష్ప 2 – 13 మిలియన్ డాలర్స్ ***

దంగల్ – 12.39 మిలియన్ డాలర్స్

పద్మావత్ – 12.17 మిలియన్ డాలర్స్

పీకే – 10.62 మిలియన్ డాలర్స్

Tags:    

Similar News