'పుష్ప 2' స్ట్రీమింగ్ అప్డేట్.. నెట్‌ఫ్లిక్స్‌లో కౌంట్‌డౌన్ షురూ
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.1900 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.1900 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. బాహుబలి 2 రికార్డ్‌ను బ్రేక్ చేయడంతో పాటు పదుల కొద్ది కొత్త రికార్డ్‌లను నమోదు చేసిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ సెన్షేషన్‌గా నిలిచింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 సినిమాను మొదట నాలుగు వారాల్లోనే ఓటీటీలో చూస్తారనే వార్తలు వచ్చాయి. సంక్రాంతి కానుకగా పుష్ప 2 ను నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తేలిపోయింది. సంక్రాంతి తర్వాత పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ వచ్చి మరోసారి సంచలనం సృష్టించింది.
పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా, భారీ వసూళ్లు నమోదు చేసినా, అభిమానులు రెండు మూడు సార్లు చూసినా ప్రేక్షకులు ఓటీటీలో చూడటం కోసం వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 30 నుంచి రాబోతుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈమధ్య కాలంలో ఏకంగా 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ కాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికే పుష్ప 2 లింక్‌ను ఉంచారు. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే 30వ తారీకు నుంచి స్ట్రీమింగ్ మొదలు కాబోతుంది.. అంటూ కౌండ్ డౌన్ షురూ చేయడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈమధ్య కాలంలో పుష్ప 2 సినిమా హెచ్‌డీ వర్షన్ ఆన్ లైన్‌లో లీక్ అయ్యిందనే వార్తలు వస్తున్నా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, రీ లోడెడ్ వర్షన్‌తో మొత్తంగా 3 గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 సినిమాను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతుంది. ఇప్పటికే థియేటర్‌లో చూసినా కూడా రీలోడెడ్ వర్షన్‌లో యాడ్ చేసిన సన్నివేశాల కోసం కచ్చితంగా ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులు స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర భారతంలో ఈ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడ మరే హిందీ సినిమా దక్కించుకోని రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంలో పాటలు కీలక పాత్ర పోషించాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా పీలింగ్స్, చూసేకి, కిస్సిక్ సాంగ్స్ ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. శ్రీలీల డాన్స్ చేసిన కిస్సిక్ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. పుష్ప 2 సినిమాలోని ప్రతి పాత్రను దర్శకుడు సుకుమార్ రూపొందించిన తీరు అద్భుతం. అల్లు అర్జున్ కి మరోసారి జాతీయ స్థాయి అవార్డును ఈ సినిమా తెచ్చి పెడుతుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మందన్న సైతం ఈ సినిమాలో మంచి నటనతో పాటు డాన్స్‌తో అలరించింది.