పుష్ప 2 హై వోల్టేజ్ బ్యాంగ్.. ఖర్చు గట్టిగానే..

ఇక పుష్ప సెకండ్ పార్ట్ లో ఊహించని సన్నివేశాలు గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు టాక్.

Update: 2024-02-27 10:00 GMT

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప సీక్వెల్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఈ సినిమా మరింత భారీ బడ్జెట్ తో తెరపైకి తీసుకువస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్ అందుకోవాలి అని కూడా ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఇక అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా ఉండాలి అని నిర్మాతలు ఇప్పటికే ప్రణాళికలు రచించారు.

పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగానే కొనసాగుతోంది. దర్శకుడు సుకుమార్ మేకింగ్ విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేంతవరకు కూడా ఏమాత్రం వదిలిపెట్టడు అని చాలా మంది నటులు చెబుతూ ఉంటారు. ఇక ఆయనతో నటించడం కూడా మంచి అనుభూతిని ఇస్తుంది అని పూర్తిస్థాయిలో నటుడిగా కూడా సంతృప్తిగా చెందుతామని అంటారు.

ఇక పుష్ప సెకండ్ పార్ట్ లో ఊహించని సన్నివేశాలు గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు టాక్. సుక్కు ఇప్పటివరకు తీసిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు చూడబోయే పుష్ప 2 మరొక లెక్క అనే విధంగా కూడా ఉంటుందట. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లోనే జాతరకు సంబంధించిన సీన్స్ కూడా ఉంటాయి అని తెలుస్తోంది.

ఒక పాట అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయట. దాదాపు 25 నిమిషాల పాటు ఉండే ఆ ఎపిసోడ్ కోసం మేకర్స్ 30 రోజులకు పైగానే కష్టపడ్డట్లు సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 50 కోట్ల రేంజ్ లో ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా కీలకం కానుంది. అందుకే ఏమాత్రం రాజీ పడకుండా కష్టపడినట్లుగా తెలుస్తోంది.

ఇక అల్లు అర్జున్ అర్ధనారీశ్వరి అవతారంలో విలన్స్ ను ఊచకోత కోయడమే కాకుండా ఉగ్రరూపంతో స్టెప్పులు వేసిన విధానం కూడా మతి పోగొట్టేలా ఉంటాయి అని తెలుస్తోంది. ఇక లీక్స్ కు ఏ మాత్రం తావివ్వకుండా సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన లీక్స్ అయితే గట్టిగానే వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం అస్సలు అలా జరగడం లేదు. కాబట్టి మేకర్స్ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టులో రాబోతున్న విషయం తెలిసిందే. మరి అంచనాలకు తగ్గట్టుగా పుష్ప బాక్సాఫీస్ వద్ద అనుకున్న టార్గెట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News