200కి పైగా ప్రైవేట్ వీడియోలు.. లావణ్య – రాజ్ తరుణ్ కేసులో షాకింగ్ ట్విస్ట్!

టాలీవుడ్‌ నటి లావణ్య, హీరో రాజ్ తరుణ్‌ల మధ్య ఇటీవల జరిగిన వివాదం ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2025-02-03 12:31 GMT

టాలీవుడ్‌ నటి లావణ్య, హీరో రాజ్ తరుణ్‌ల మధ్య ఇటీవల జరిగిన వివాదం ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ కేసులో తాజాగా మరో కీలక మలుపు తిరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లావణ్య పోలీసులను ఆశ్రయించి మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె తన ఫిర్యాదులో రాజ్ తరుణ్ తమ రిలేషన్‌షిప్ నుంచి వెనుకడుగు వేయడానికి మస్తాన్ సాయే ప్రధాన కారణమని పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు వెంటనే స్పందించి మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు.

లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, మస్తాన్ సాయి ఇతర అమ్మాయిల వ్యక్తిగత ప్రయివేట్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశాడని, వాటిని బ్లాక్‌మెయిల్‌కు ఉపయోగించేవాడని తెలిపింది. ఈ విషయంలో ఆమె తన దగ్గరున్న కొన్ని వీడియోలను పోలీసులకు అందజేశారు. దీంతోపాటు, మస్తాన్ సాయి తన బాధితులను మత్తులోకి నెట్టి, లైంగిక దాడులకు పాల్పడి, ఆ దృశ్యాలను చిత్రీకరించేవాడన్న విషయం ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి .

ఈ కేసులో మస్తాన్ సాయిపై మరిన్ని ఆరోపణలు వెల్లడి అయ్యాయి. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఈ వ్యక్తి, టాలీవుడ్‌లో పలువురు ప్రముఖుల వీడియోలను తన దగ్గర భద్రపరచి వాటిని ఉపయోగించి వారిపై ఒత్తిడి తేవడమే తన మిషన్‌గా పెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతని హార్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డిస్క్‌లో 200కి పైగా వ్యక్తిగత వీడియోలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, యువ హీరో , ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఆ హార్డ్ డిస్క్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. లావణ్య తన ఫిర్యాదులో మస్తాన్ సాయి తన ఇంట్లో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చి తన వ్యక్తిగత క్షణాలను రికార్డ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, వీడియో కాల్స్, ప్రైవేట్ చాట్స్ ఇలా 40కి పైగా డేటా అతని వద్ద ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే మస్తాన్ సాయిపై అనేక మంది ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతనిపై మోసం, లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్, సైబర్ నేరాల కింద కేసులు నమోదు చేసే అవకాశముంది. టాలీవుడ్‌లో ఇది పెద్ద సంచలనంగా మారడంతో మరింత మంది బాధితులు ముందుకు వస్తారనే సమాచారం. ప్రస్తుతం పోలీసులు మస్తాన్ సాయి గత నేర చరిత్రను విశ్లేషిస్తున్నారు. గతంలో ఆయనకు సంబంధించి నడిచిన వివాదాస్పద కేసులు, ఇందులో ఇంకా ఎవరెవరున్నారన్న అంశాలను వెలుగులోకి తేవడానికి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో మరిన్ని షాకింగ్ డిటెయిల్స్ బయటకు వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News