సూప‌ర్ స్టార్ కోత 210 కోట్లు.. ఇది రికార్డు!

`జైల‌ర్` భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. బాక్సాపీస్ వ‌ద్ద సినిమా 600కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.

Update: 2023-09-01 06:05 GMT

`జైల‌ర్` భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. బాక్సాపీస్ వ‌ద్ద సినిమా 600కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ రేంజ్ లో విజ‌య ఢంకా మోగిస్తుంద‌ని యూనిట్ కూడా అంచ‌నా వేయ‌లేదు. ర‌జ‌నీ కాంత్ ప్లాప్ ట్రాక్... ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలిప్ కుమార్ ఫెయిల్యూర్ వంటి స‌న్నివేశాల నేప‌థ్యంలో రిలీజ్ అయిన `జైల‌ర్` ఈ రేంజ్ లో విజ‌యం సాధింస్తుంద‌ని ఏమాత్రం ఊహించ‌లేదు.

ఒక‌వేళ స‌క్సెస్ అయినా 300 కోట్ల వ‌ర‌కూ ఉండొచ్చ‌ని ట్రేడ్ అంచ‌నా వేసింది. కానీ అన్ని లెక్క‌ల్ని `జైల‌ర్` తారుమారు చేసింది. ఏకంగా 500 కోట్ల మార్క్ ని దాటి 600 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది. ఇదే మీ భారీ బ‌డ్జెట్ చిత్రం కాదు. చాలా సాధార‌ణంగా నిర్మాణ‌మైన సినిమా. కేవ‌లం ర‌జ‌నీ ఇమేజ్..ఎలివేష‌న్ల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ విజ‌యోత్స‌హాంలో చిత్ర నిర్మాత క‌ళా నిధిమార‌న్ ర‌జనీకాంత్ మ‌రో వంద కోట్లు అద‌నంగా పారితోషికం చెల్లించారు.

తొలుత 110 కోట్లు పారితోషికం తీసుకోగా..అటుపై విజ‌యం నేప‌థ్యంలో మ‌రో 100 కోట్లు అద‌నంగా చెల్లించారు. దీంతో `జైల‌ర్` సినిమాకి ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష్ మొత్తం 210 కోట్లుగా తేలింది. దీంతో దేశంలోనే అత్య‌ధిక పారితోషికం తీసుకున్న స్టార్ గా ర‌జ‌నీకాంత్ మ‌రో సారి సినీ చ‌రిత్ర‌లోకి ఎక్కారు. ఈ రేంజ్ స‌క్సెస్ ర‌జ‌నీకాంత్ కి ప‌డి చాలా కాల‌మ‌వుతుంది.

`రోబో` త‌ర్వాత చేసిన సినిమాలేవి ఆయ‌న మార్కెట్ రేంజ్ ని అందుకున్న చిత్రాలు కావు. 2000 కోట్లు రాబ‌ట్టాల్సిన 2.0 కూడా 600 కోట్ల వ‌సూళ్ల‌తో స‌రిపెట్టాయి. `లింగ‌`.. `కాలా`..`క‌బాలి`..`పెట్టా`.. `దర్బార్`...`అన్నాథై` లాంటి సినిమాలేవి కూడా ర‌జ‌నీ రేంజే లో హిట్ సాధించ‌లేదు. ఆ లెక్క‌న చూస్తే దాదాపు ద‌శాబ్ధం దాటిన త‌ర్వాత ర‌జ‌నీకి వ‌చ్చిన భారీ విజ‌యం ఇది. `రోబో` రిలీజ్ అయి ప‌దేళ్లు దాటిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News