పిక్ టాక్ : సింగిల్ ఫ్రేమ్‌లో ఇద్దరు ముద్దుగుమ్మలు
రకుల్ ప్రీత్ తో పాటు ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ కలిసి మిర్రర్ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
టాలీవుడ్‌లో యంగ్ స్టార్ హీరోలందరితోనూ నటించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాల హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఐదేళ్ల పాటు టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా కొనసాగింది. ఒకానొక సమయంలో మహేష్ బాబు సినిమాకు సైతం డేట్లు ఇవ్వలేనంత బిజీగా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు చేసింది. అంతటి బిజీ హీరోయిన్ ఇప్పుడు పెద్దగా ఆఫర్లు లేక పోవడంతో సోషల్ మీడియాలో ఫోటో షూట్స్‌కి, అప్పుడప్పుడు స్టేజ్ షోలకు పరిమితం అవుతోంది. ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది.
పెళ్లి తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతాను అంటూ రకుల్ చెప్పింది. అన్నట్లుగానే ఆమె ఒకటి రెండు సినిమాల్లో నటిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు విదేశాల్లో ఉంది. ఎప్పుడూ ఏ సినిమా వేడుకలో అయినా రకుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు లండన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేస్తోంది. రకుల్ ప్రీత్ తో పాటు ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ కలిసి మిర్రర్ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు. సెల్ఫీకి ఇద్దరూ ఇచ్చిన ఫోజ్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇద్దరి అందం అంతకు మించి అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సింగిల్ ఫ్రేమ్‌లో ఇద్దరినీ చూస్తూ ఉంటే ముందు ఎవరిని చూడాలో అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వీరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వీరిద్దరూ మరింత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముందు ముందు వీరికి మరిన్ని సినిమాల్లో ఆఫర్లు వస్తాయని అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో బిజీ అవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
ఇక ప్రగ్యా జైస్వాల్ ఇంతటి అందం ఉన్నా లక్ కలిసి రాకపోవడంతో యంగ్ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోలేక పోయింది. బాలకృష్ణతో ఈమె నటించిన డాకు మహారాజ్ సినిమా ఈ సంక్రాంతికి రాబోతుంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమాతో అయినా ప్రగ్యా జైస్వాల్ లక్ కలిసి వస్తుందా అనేది చూడాలి. ఈమధ్య కాలంలో ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్‌లోనూ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హిందీ వెబ్ సిరీస్‌ల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి ఆ వెబ్ సిరీస్‌కి ఓకే చెప్పిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.