ర‌కుల్ .. హా* తో హై అంటారా?

అందాల ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల పూర్తిగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. `భార‌తీయుడు 2` త‌ర్వాత సౌత్ లో ఈ భామ న‌టించిన‌ సినిమాలేవీ లేవు.

Update: 2025-02-08 02:30 GMT

అందాల ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల పూర్తిగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. `భార‌తీయుడు 2` త‌ర్వాత సౌత్ లో ఈ భామ న‌టించిన‌ సినిమాలేవీ లేవు. త‌దుప‌రి ర‌కుల్ `మేరే హస్బెండ్ కి బివి` అనే హిందీ చిత్రంతో అభిమానుల ముందుకు వ‌స్తోంది. అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా నటించిన ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. ట్రైల‌ర్ లో ఆన్-పాయింట్ జోకులు, ముక్కోణ ప్రేమ‌క‌థ ఆక‌ట్టుకుంటున్నాయి. ట్ర‌యాంగిల్ అనేది ఒక స‌ర్కిల్ అని సందేశం ఇస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అర్జున్ క‌పూర్- ర‌కుల్ ప్రీత్ మ‌ధ్య కెమిస్ట్రీ ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంటోంది.

ప్ర‌స్తుతం `మేరే హ‌స్బెండ్ కి బివి` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న ర‌కుల్ ప్రీత్ తాజా ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. తాజాగా ర‌కుల్ షేర్ చేసిన డిజైన‌ర్ ఫ్రాక్ లుక్ యూత్ లోకి దూసుకెళుతోంది. ర‌కుల్ ఈ లుక్ లో సంథింగ్ స్పెష‌ల్ గా ఉందంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. డిజైనర్ లాంగ్ ఫ్రాక్ లో ర‌కుల్ రెబ‌ల్ లా క‌నిపించిందంటూ కొంద‌రు ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఈ ఫోటోగ్రాఫ్ కి హాట్ హోతా హై అంటారా? అని క్యాప్ష‌న్ ని ఇచ్చింది ర‌కుల్.

ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రాన్ని ర‌కుల్ భ‌ర్త జాకీ భ‌గ్నానీ నిర్మించారు. నిర్మాత జాకీ భగ్నాని మాట్లాడుతూ.. ఈ సినిమా యువ‌త‌రాన్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని తెలిపారు. మేరే హస్బెండ్ కి బివి ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలవుతుంది. ర‌కుల్ త‌దుప‌రి భార‌తీయుడు 3లోను క‌నిపించే వీలుంది.

Tags:    

Similar News