రకుల్ ప్లానింగ్ లేకుండానే హీరోయిన్ అయిందా?
కానీ ఎలాంటి యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ లేని రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ మాత్రం తాను ఏమాత్రం గెస్ చేయని విధంగా సాగుతుంది.
రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కెళ్లి సక్సెస్ అయిన భామ. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన తర్వాతే అమ్మడికి బాలీవుడ్ లో అవకాశాలు వరించాయి. ప్రస్తుతం అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఇలా సక్సెస్ అవ్వాలంటే ఏ నటికైనా ఓ ప్రణాళిక ఉంటుంది? దాని ప్రకారం ముందుకెళ్తూ భవిష్యత్ ని నిర్దేశించుకుంటారు.
బ్యాక్ గ్రౌండ్ లేని భామల విషయంలో ఎలా ఉంటుందంటే? సినిమాల్లోకి రావాలంటే ముందుగా మోడలింగ్ చేయడం... చిన్న చిన్న యాడ్స్ చేయడం అక్కడ నుంచి యాడ్ ఏజెన్సీలకు వెళ్లడం... నచ్చితే సినిమాల్లో ఏ దర్శక, నిర్మాత అయినా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎలాంటి యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ లేని రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ మాత్రం తాను ఏమాత్రం గెస్ చేయని విధంగా సాగుతుంది.
అమ్మడు మోడల్ కాదు. 'గిల్లి' అనే కన్నడ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'కెరటం'తో తెలుగులో లాంచ్ అయింది. అటుపై తమిళ్ లో 'యువన్' అనే సినిమా చేసింది. ఇవేవి అమ్మడికి గుర్తింపు తీసుకు రాలేదు. కానీ తెలుగులో మాత్రం 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' విజయంతో అమ్మడి స్టార్ మారిపోయింది. అక్కడ నుంచి వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ అందుకుంది. అటుపై తమిళ్ లోనూ బిజీ అయింది.
అక్కడ నుంచి హిందీలోనూ తిరుగులేని భామగా ఎదుగుతోంది. అయితే కెరీర్ ఇలా సంతోషంగా సాగిపో తుందని తానుఏ మాత్రం ఊహించలేదంటోంది. తనకు దక్కిన అవకాశాల విషయంలో అదృష్టం అనే పదం చాలా చిన్నదిగానే ఉంటుందంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావించింది. ఇలా జరుగుతుందని ఏనాడు కలగనలేదని....సినిమాల్లోకి రావడం..సక్సెస్ అవ్వడం అన్నీ దానంతట అదే జరిగిందని తెలిపింది.