రాజమౌళి, శంకర్ లో టాస్క్ మాస్టర్ ఎవరంటే.. : రామ్ చరణ్

ఆ ఈవెంట్ లో రామ్ చరణ్.. స్పీచ్ ఇవ్వకుండా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇచ్చారు.

Update: 2025-01-02 15:12 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ చేంజర్ మూవీతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఆ మూవీ.. జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ నేడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్ లో రామ్ చరణ్.. స్పీచ్ ఇవ్వకుండా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇచ్చారు.

శంకర్ గారు ఏ విషయంలో అన్ ప్రెడిక్టబుల్ అని యాంకర్ సుమ అడగ్గా.. "ఆయన అద్భుతమైన సినిమాలు తీసే విషయంలో ప్రెడిక్టబుల్. రాజమౌళి గారు.. ఆయనతో ఓపిగ్గా పనిచేయమని ట్రైనింగ్ ఇచ్చారు. అది నాకెంతో హెల్ప్ అయింది. సాంగ్స్ అంటారా.. మీ ఊహాలకు మించి ఉంటాయి. ఆయనతో నాది బ్యూటిఫుల్ జర్నీ. బ్రెయిన్ ఇంట్లో పెట్టి వెళ్లి మేకప్ వేసుకోవడమే" అని చెప్పారు.

సుకుమార్, రాజమౌళి ఇప్పుడు శంకర్.. వాళ్ళతో పనిచేయడం ఎలా ఉందని అడగ్గా.. "నేను చాలా అదృష్టవంతుడిని. సుకుమార్, రాజమౌళి, శంకర్ గార్లతో పనిచేసే అవకాశం వచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెబుతాను. ఒక్కొక్కరితో రెండు- మూడేళ్ల వర్క్ చేశాను. ఆ సమయంలో ఎంతో నేర్చుకున్నా" అని తెలిపారు.

రాజమౌళి, శంకర్ లో ఎవరు టాస్క్ మాస్టర్ అని అడగ్గా.. ఇద్దరూ టాస్క్ మాస్టర్స్ అని తెలిపారు చరణ్. ఇద్దరిలో చాలా సిమిలేరిటీస్ ఉన్నాయని చెప్పారు. స్క్రీన్ వెనుక ఇద్దరూ మంచి మోటివేటర్స్ అని పేర్కొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ లో ఫ్రీడం ఇస్తారని చెప్పారు.

జక్కన్న, శంకర్ లో ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అని అడగ్గా.. అసలు ఇద్దరూ కాదు అని తెలిపారు రామ్ చరణ్. ఇద్దరూ బ్యూటిఫుల్ పర్సన్స్ అని చెప్పారు. చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద నటుడి వరకు అందరితో ఓపెన్ గా ఉంటారని అన్నారు. ఓపెన్ గా ఏమైనా అభిప్రాయం చెబితే.. నచ్చితే కచ్చితంగా తీసుకుంటారని తెలిపారు.

షెడ్యూల్ లో డోప్ మూమెంట్ ఏంటి అని అడగ్గా.. మనసు పెట్టి పనిచేయాలని డిసైడ్ అయ్యానని తెలిపారు. టైమ్ వదులుకున్నానని చెప్పారు. ఐపీఎస్ అధికారి పాత్ర కోసం మధురై ఎంపీ వెంకటేషన్ తో శంకర్ కొన్ని సీన్స్ రాయించారని పేర్కొన్నారు. ఆయనకు మంచి టాలెంట్ ఉందని చెప్పారు. అనేక విషయాలను తెలుసుకున్నానని వెల్లడించారు.

రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఎప్పుడు రానుందని అడగ్గా.. కొవిడ్ ఏం లేకపోతే ఏడాదిన్నరలో వస్తుందని రామ్ చరణ్ తెలిపారు. ఎవరూ వర్రీ అవ్వక్కర్లేదని చెప్పారు. గేమ్ ఛేంజర్ లోని ప్రతీ సీన్ కోసం అంతా చాలా కష్టపడ్డారని కొనియాడారు. అందరికీ ధన్యవాదాలు చెబుతూ.. సినిమాకు పిల్లర్స్ లాంటి వాళ్లని అన్నారు.

Tags:    

Similar News