షూటింగ్ లో రౌడీలు.. శింగనమల రమేష్ పై సదానంద్ కౌంటర్..!

ఐతే పవన్, మహేష్ పేర్ల ప్రస్తావన తీసుకు రావడంతో రమేష్ చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి.

Update: 2025-02-08 17:58 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కొమరం పులి, సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఖలేజా సినిమాలను నిర్మించిన శింగనమల రమేష్ అనే నిర్మాత చాలాకాలం జైల్లో ఉండి వచ్చాడు. ఐతే ఇటీవలే కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. అందుకే ఈమధ్య రమేష్ ప్రెస్ మీట్ పెట్టి తన సినిమాల గురించి ఇంకా తను జైల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎంతోమంది తన దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని చెప్పాడు. ఐతే పవన్, మహేష్ పేర్ల ప్రస్తావన తీసుకు రావడంతో రమేష్ చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి.

ముఖ్యంగా కొమరం పులి, ఖలేజా సినిమాల వల్ల వంద కోట్ల నష్టం వచ్చిందని.. ఐతే తను కష్టాల్లో ఉనప్పుడు ఏ హీరో తనని పట్టించుకోలేదని అన్నాడు. ఐతే రమేష్ ఆరోపణలకు రివర్స్ కౌంటర్ ఇస్తూ వైజయంతి రెడ్డి అనే ఫైనాన్షియర్ తరపున ఆమె భర్త సదానంద్ ప్రెస్ మీట్ పెట్టి రమేష్ వ్యాఖ్యలను ఖండించారు.

రమేష్ మోసగాడని.. తమ దగ్గర ఫైనాన్స్ తీసుకుని ఆ డబ్బులతోనే సినిమాలు తీశాడని అన్నారు సదానంద్. అంతేకాదు ఈ సినిమాలు హీరోల వల్ల లేట్ అవ్వలేదని షూటింగ్ టైం లో మద్దెలచెరువు సూరి, భానుకిరణ్ లాంటి ఫ్యాక్షనిస్టులు లొకేషన్ కి వచ్చారని అందుకే హీరోలు, ఆర్టిస్టులు షూటింగ్ కు రాలేదని అన్నారు సదానంద్. ఆయన తప్పుడు విధానాల వల్లే ఆ సినిమాలు లేట్ అయ్యాయి తప్ప హీరోలు డైరెక్టర్స్ అసలు కారణం కాదని అన్నారు సదానంద్.

తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే అతని రౌడీ గ్యాంగ్ తో తుపాకి తలపై పెట్టి చంపేస్తామని బెదిరించారని సదానంద్ వెల్లడించారు. దీని గురించి ఆల్రెడీ హైదరాబాద్ సీసీఎస్ లో కేసు పెట్టామని.. ఆ కేసు తర్వాత సీఐడీకి బదిలీ అయ్యిందని అన్నారు సదానంద్. రమేష్ పై పెట్టిన కేసు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇటీవల కొట్టేసింది.. ఐతే దాని మీద త్వరలో హైకోర్టులో అప్పీల్ కి వెళ్తామని అన్నారు సదానంద్. శింగనమల రమేష్ 300 కోట్ల దాకా డబ్బులు ఇవ్వాలని.. ఐతే అతని వల్ల నష్టానికి గురైన బాధితులు అందరు తెలంగాణ, తమిళనాడు సీఎం లను కలిస్తామని అన్నారు సదానంద్.

Tags:    

Similar News