డ‌బ్బు..పేరు ప్ర‌తిష్ట‌లు ఎండ‌మావులు లాంటివి!

భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ లు చేయాలంటే రామ్ ల‌క్ష్మ‌ణ్ లు ఉండాల్సిందేనని హీరోలు సైతం ప‌ట్టుబ‌డ‌తారు.

Update: 2024-06-06 13:30 GMT
డ‌బ్బు..పేరు ప్ర‌తిష్ట‌లు ఎండ‌మావులు లాంటివి!
  • whatsapp icon

ఫైట్ మాస్టార్లు రామ్-ల‌క్ష్మ‌ణ్ గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. ఎన్నో చిత్రాల‌కు స్టంట్స్ కొరియోగ్ర‌ఫీ చేసి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నారు. ఎంతో మంది స్టార్ హీరోల‌కు ఫైట్ మాస్ట‌ర్ల‌గా ప‌నిచేసారు. దాదాపు అగ్ర హీరోలందరికీ స్టంట్ మాస్ట‌ర్లు వాళ్లే. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ లు చేయాలంటే రామ్ ల‌క్ష్మ‌ణ్ లు ఉండాల్సిందేనని హీరోలు సైతం ప‌ట్టుబ‌డ‌తారు. అంత‌గా ఫేమ‌స్ అయిన మాస్ట‌ర్లు. ఇద్ద‌రు క‌వ‌ల‌లు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఆస్థాయికి ఎదిగారు. పెద్ద‌గా చదువ‌కోలేదు కూడా. అయినా కృషితో నాస్తి దుర్బిక్షం అన్న‌ట్లు ఇండస్ట్రీలో స‌క్సెస్ అయ్యారు. తాజాగా రామ్ ల‌క్ష్మ‌ణ్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకు న్నారు. అవి ఏంటో వాళ్ల మాట‌ల్లోనే.. 'ఇండస్ట్రీకి కొత్తవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది, కొత్తవారు వస్తున్నారు. మమ్మల్ని పక్కన పెడుతున్నారని మేము బాధపడటం లేదు. అలాంటి ఆలోచ‌న కూడా రానివ్వం.

మేము అనుకున్న దానికంటే ఇండస్ట్రీ మాకు ఎక్కువగానే ఇచ్చింది. అందుకు మేము ఇండస్ట్రీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్క‌డో సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌పాల్సిన వాళ్లం. ఈ రోజు ఇక్క‌డ స‌క్సెస్ పుల్ గా ఉన్నామంటే దానికి కార‌ణం మాకు స‌హాయం చేసిన వారితో పాటు ఇండ‌స్ట్రీ స‌హ‌క‌రించ‌డంతోనే ఈస్థాయికి చేరుకున్నాం. అందుకు వాళ్ల‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాం. హీరోలు కావాల‌ని అడిగి మ‌రీ మ‌మ్మ‌ల్ని వారి సినిమాల‌కు పెట్టుకుంటారు. అదంతా మా అదృష్టంగానే చెబుతాం.

మా ఆహారం .. అలవాట్లు .. మొత్తంగా చెప్పాలంటే మా లైఫ్ చాలా సింపుల్. డబ్బు , పేరు ప్రతిష్ఠలు ఎండమావుల వంటివి. మనం ఎంత దూరం పరిగెత్తినా ఇంకాస్త దూరంలో అవి కనిపిస్తూనే ఉంటాయి. అందువలన వాటి గురించి మేము ఏనాడు ఆలోచించం. ఆశపడటం లేదు. మాకు రావలసిన అవకాశం పోయిందని నిరాశపడం . మా కంటే ఎక్కువ అవసరంలో ఉన్న మరొకరికి ఆ ఛాన్స్ వెళ్లినందుకు హ్యాపీగా ఫీలవుతాం` అని అన్నారు.

Tags:    

Similar News