వంగ ట్రేడ్ మార్క్ కిస్సు.. ఈసారి గాలిలో..

ఇక విడుదలైన పోస్టర్లు ఫస్ట్ లుక్ టీజర్లతోనే ఈ సినిమా చాలా వైల్డ్ గా ఉండబోతున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది.

Update: 2023-10-10 06:22 GMT

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న తదుపరి సినిమా యానిమల్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. టాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు అదే కథను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఈ దర్శకుడి పై సౌత్ ఇండస్ట్రీలోనూ నార్త్ ఇండస్ట్రీలోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.


తప్పకుండా ఈ సినిమాతో సక్సెస్ అందుకుని మరో రేంజ్ కు వెళ్లాలని సందీప్ చాలా కసిగా కనిపిస్తున్నాడు. ఇక విడుదలైన పోస్టర్లు ఫస్ట్ లుక్ టీజర్లతోనే ఈ సినిమా చాలా వైల్డ్ గా ఉండబోతున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ లుక్ టీజర్ లోనే హీరో రణబీర్ కపూర్ ను రక్తంతో చాలా క్రూరంగా చూపిస్తూనే మరోవైపు స్టైలిష్ డాన్ గా కూడా చూపించే ప్రయత్నం చేశాడు.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో రొమాంటిక్ డోస్ ఏ లెవెల్లో వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాల్లో కూడా సందీప్ రెడ్డి వంగ ట్రేడ్ మార్క్ రొమాంటిక్ సీన్లు గట్టిగానే ఉండబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక యాక్షన్ రొమాంటిక్ సీన్ గురించి చాలా రకాల లీక్స్ బయటకు వచ్చాయి.

ఒకవైపు ఫైట్ చేస్తూనే మరొకవైపు రొమాన్స్ తో కూడా హీరో స్టన్ అయ్యేలా కనిపిస్తాడు అని చాలా రకాల స్టోరీలు బయటకు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా విడుదల చేసిన మరొక పోస్టర్ చూస్తే సినిమాలో రొమాంటిక్ డోస్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. అర్జున్ రెడ్డి సినిమాలో కారులో బైక్ పై పలు రొమాంటిక్ సీన్స్ చూపించిన దర్శకుడు ఈసారి ఏకంగా ఫ్లైట్లో ముద్దులు సీన్లతో షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఫ్లైట్ నడుపుతున్నట్లు కనిపిస్తున్న హీరో హీరోయిన్ లిప్ లాక్ పెట్టుకున్న ఒక పోస్టర్ను విడుదల చేశారు. అమ్మాయి అనే ఒక పాటను విడుదల చేస్తున్న సందర్భంగా ఈ పోస్టర్ను రిలీజ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే ఈ పోస్టర్ బజ్ క్రియేట్ చేసింది. సందీప్ రెడ్డి వంగా ట్రేడ్ మార్క్ కిస్సులు ఇందులో కూడా ఉన్నాయి అంటూ నెటిజన్లు కొంటెగా స్పందిస్తున్నారు. మరి ఇంతగా హైప్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు మళ్ళి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News