జపాన్ లో రంగస్థలం బాక్సాఫీస్ జాతర.. రికార్డులు బ్లాస్ట్
రంగస్థలం సినిమా మొదటి రోజు జపాన్ లో అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న ఇండోయన్ సినిమా రికార్డును క్రియేట్ చేసింది
రామ్ చరణ్ తేజ్ నటించిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే 2018 లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు రీసెంట్ గా జపాన్లో విడుదల అయింది. అక్కడ స్థానిక భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు. పెద్దగా ప్రమోషన్స్ కూడా అయితే చేయలేదు. అయితే ఇదివరకే రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసిన నటించిన RRR సినిమా మాత్రం జపాన్లో మంచి కలెక్షన్స్ అందుకుంది.
అక్కడ అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాగా కూడా RRR రికార్డును క్రియేట్ చేసింది. ఆ సినిమా ద్వారా రామ్ చరణ్ తేజ్ జపాన్ సినీ లవర్స్ కు బాగా దగ్గరయిపోయాడు. అయితే ఇప్పుడు అక్కడ రంగస్థలం సినిమాకు ఆ క్రేజ్ బాగా ఉపయోగపడినట్లు అర్థమవుతోంది.
ఎందుకంటే రంగస్థలం సినిమా మొదటి రోజు జపాన్ లో అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న ఇండోయన్ సినిమా రికార్డును క్రియేట్ చేసింది.
అసలు ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయి అని ఎవరు ఊహించలేదు. ప్రస్తుతం ఈ విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. జపాన్లో మొదటి రోజు 70 స్క్రీన్స్ లలో మాత్రమే విడుదలైన రంగస్థలం సినిమా 2.5 మిలియన్స్ జపాన్ కరెన్సీని సాధించింది. ఇంతకుముందు KGF 2, RRR సినిమాలు అత్యధిక స్థాయిలో జపాన్లో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలుగా నిలిచాయి.
ఇప్పుడు KGF 2 రికార్డును కూడా రంగస్థలం బ్రేక్ చేసి దూసుకుపోతోంది. చూస్తూ ఉంటే ఈ సినిమా కూడా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇండియన్ సినిమాలకు జపాన్లో మంచి క్రేజ్ ఏర్పడుతుంది. అప్పుడెప్పుడో వచ్చిన ముత్తు సినిమాతో పాటు ఆ తర్వాత త్రీ ఇడియట్స్, దంగల్ అలాగే RRR, KGF 2 సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ అందుకున్నాయి.
ఇక ఇప్పుడు రంగస్థలం సినిమా కూడా అక్కడి జనాలకు కనెక్ట్ అవుతూ ఉండడం విశేషం. అది కూడా తెలుగు నేటివిటీ దగ్గరగా ఉన్న సినిమా కావడం తో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇది గర్వకారణం అనే చెప్పాలి. మరి మొత్తంగా జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.